YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కథువా కేసు విచారణపై సుప్రీం స్టే కేసును సీబీఐకి అప్పగించాలి కోర్టుకు విన్నవించినబాధితురాలి తండ్రి

 కథువా కేసు విచారణపై సుప్రీం స్టే కేసును సీబీఐకి అప్పగించాలి కోర్టుకు విన్నవించినబాధితురాలి తండ్రి

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కథువాలోని 8ఏళ్ల బాలిక అత్యాచారం, హత్య కేసులో విచారణపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ కేసులో మే  7 వరకు ఎలాంటి దర్యాప్తు చేపట్టరాదని స్పష్టం చేసింది. కేసు విచారణను చండీగఢ్‌కు బదిలీ చేయాలని, సీబీఐకి అప్పగించాలని పిటిషన్లు వస్తున్న నేపథ్యంలో న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రా నేతృత్వంలో జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ ఇందు మల్హోత్రాలతో కూడిన ధర్మాసనం వెల్లడించింది.ఈ కేసులో బాధితురాలి తండ్రి అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకునే అవకాశాలున్నాయని ఈ సందర్భంగా ధర్మాసనం పేర్కొంది. దీనిపై తదుపరి విచారణను మే 7కు వాయిదా వేసింది. అప్పటి దాకా ఎలాంటి విచారణ చేపట్టరాదని స్పష్టం చేసింది.జమ్ముకశ్మీర్‌లోని కథువా జిల్లాకు చెందిన ఎనిమిదేళ్ల బాలికపై ఈ ఏడాది జనవరిలో సామూహిక అత్యాచారం జరిగిన విషయం తెలిసిందే. అనంతరం ఆమెను అతి పాశవికంగా హత్య చేశారు. గత నెలలో ఈ దారుణం వెలుగులోకి రావడంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని యావత్‌ దేశం నుంచి డిమాండ్లు వెల్లువెత్తాయి.ఈ కేసులో ఇప్పటివరకు ప్రధాన నిందితులు సహా 8 మందిని అరెస్టు చేశారు. అయితే, ఈ కేసు విచారణను జమ్ముకశ్మీర్‌ కోర్టుల్లో చేయవద్దని, చండీగఢ్‌కు బదిలీ చేయాలని బాధితురాలి తండ్రి కోర్టుకు విన్నవించుకున్నారు. అంతేగాక దీన్ని సీబీఐకి అప్పగించాలని కోరుతున్నారు. అయితే, విచారణ పారదర్శకంగా జరగకపోతే కేసును మరో ప్రాంతానికి బదిలీ చేస్తామని ఇప్పటికే సుప్రీంకోర్టు జమ్ముకశ్మీర్‌ స్థానిక న్యాయస్థానాన్ని హెచ్చరించింది.

Related Posts