YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

సెకండ్ వేవ్ గ్రామాల్లోకి చేర‌కుండా ప్ర‌తిఒక్క‌రూ నిరోధించాలి... ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ పిలుపు

సెకండ్ వేవ్ గ్రామాల్లోకి చేర‌కుండా ప్ర‌తిఒక్క‌రూ నిరోధించాలి...  ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ పిలుపు

న్యూఢిల్లీ ఏప్రిల్ 24
‌కొవిడ్-19 సెకండ్ వేవ్ ఆందోళ‌న‌క‌రంగా వ్యాప్తి చెందుతున్న నేప‌థ్యంలో ఈ మ‌హ‌మ్మారి గ్రామాల్లోకి చేర‌కుండా ప్ర‌తిఒక్క‌రూ నిరోధించాల‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పంచాయితీరాజ్ దినం సంద‌ర్భంగా ప్ర‌ధాని మోదీ శ‌నివారం ఓ కార్య‌క్ర‌మంలో మాట్లాడుతూ గ‌త ఏడాది ఇదే స‌మ‌యంలో దేశ‌మంతా క‌రోనా వైర‌స్ తో పోరాడుతోంద‌ని ఆ స‌మ‌యంలో మ‌హ‌మ్మారి ప‌ల్లెల్లోకి పాక‌కుండా నిరోధించాల‌ని తాను పిలుపు ఇవ్వ‌గా మీరంతా స‌మ‌ర్దంగా పోరాడార‌ని ప్ర‌శంసించారు.ఈ ఏడాది కూడా మ‌హ‌మ్మారిని మ‌న గ్రామాల్లోకి రాకుండా అడ్డుకోవ‌డంతో పాటు గ్రామ‌స్తుల్లో వైర‌స్ ప‌ట్ల అవ‌గాహ‌న పెంచాల‌ని కోరారు. గ్రామ‌ల్లో అంద‌రూ కొవిడ్ మార్గ‌ద‌ర్శ‌కాల‌ను పాటించేలా చొర‌వ చూపాల‌ని ప్ర‌ధాని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్ర‌జ‌లంద‌రూ వ్యాక్సిన్ రెండు డోసులూ తీసుకునేలా ప్రోత్స‌హించాల‌ని కోరారు.
 

Related Posts