YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ప్రభుత్వ పాలనలో ప్రజల భాగస్వామ్యం

ప్రభుత్వ పాలనలో ప్రజల భాగస్వామ్యం

హైద‌రాబాద్ ఏప్రిల్ 24, ప్రభుత్వ పాలనలో ప్రజల భాగస్వామ్యం ప్రజల సహకారంతోనే ప్రగతిపథంలో పాలనావ్యవస్థ రాజ‌కీయాల‌కు అతీతంగా గ్రామాల అభివృద్ధి జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్
జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ పాలనలో ప్రజల భాగస్వామ్యం పెరిగినపుడే, ప్రజల సహకారంతోనే పాలనావ్యవస్థ ప్రగతిపథంలో ముందడుగు వేస్తుందని సీఎం అన్నారు. స్వాతంత్ర్యానంతర భారత దేశంలో ప్రజలను పాలనలో భాగస్వాములను చేయాలనే మహోన్నత లక్ష్యంతో నాటి సోషల్ ఇంజనీర్ గా ప్రసిద్ది పొందిన సురీందర్ కుమార్ డే (ఎస్‌కేడే) పంచాయతీరాజ్ వ్యవస్థకు అంకురార్పణ చేశారన్నారు.  ప్రజలు తమ అభివృద్ధిని తామే నిర్వచించుకునే స్వయం సహకార ఉద్యమం లో భాగంగా పంచాయతీ రాజ్ వ్యవస్థ భారత దేశంలో రూపుదిద్దుకున్నదని సీఎం గుర్తు చేసుకున్నారు.కమ్యునిటీ డెవ‌ల‌ప్‌మెంట్‌లో భాగంగా రాజకీయాలకు అతీతంగా గ్రామాల అభివృద్ది జరుగాలనే నాటి ఎస్‌కేడే ఆశయాలను తెలంగాణ ప్రభుత్వం అమలు పరుస్తున్నదని సీఎం తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం అమలులోకి తెచ్చిన నూతన పంచాయతీరాజ్ చట్టం దేశ పంచాయతీరాజ్ వ్యవస్థకు ఆదర్శంగా నిలిచిందని సీఎం అన్నారు. ఎవరి గ్రామాన్ని వారే తీర్చిదిద్దుకునే విధంగా ప్రజలను భాగస్వాములను చేస్తూ పల్లెల్లో పాలనావ్యవస్థను ప్రభుత్వం బలోపేతం చేసిందని తెలిపారు.పల్లెల అభివృద్దికిగాను ప్రతినెలా రూ. 339 కోట్లు, పట్టణాల అభివృద్ధికి ప్రతినెలా రూ.148 కోట్లు క్రమం తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్నదన్నారు. పంచాయితీరాజ్ వ్యవస్థ బలోపేతానికి తెలంగాణ ప్రభుత్వం భారతదేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలు పరుస్తున్న పల్లె ప్రగతి పట్టణ ప్రగతి సహా ఇతర అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలతో పల్లెలు పట్టణాలు పరిశుభ్రంగా పచ్చదాన్ని సంతరించుకుని అభివృద్ది పథంలో నడుస్తున్నయన్నారు. దేశంలో మరే రాష్ట్రం అందుకోని విధంగా తెలంగాణ పంచాయతీ రాజ్ శాఖ కేంద్ర ప్రభుత్వ సంస్థల చేత అనేక జాతీయ అవార్డులు ప్రశంసలను అందుకుంటున్నదన్నారు. రాష్ట్రంలో పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతం అవుతున్నదనడానికి ఈ అవార్డులు ప్రశంసలు నిదర్శనంగా నిలిచినాయని సీఎం తెలిపారు.సాగు నీటి ప్రాజెక్టుల నిర్మాణం, రైతు సంక్షేమం, వ్యవసాయాభివృద్ధితో పాటు గ్రామీణ ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం అమలు పరుస్తున్న పలు పథకాలు సబ్బండ వర్గాలను అభివృద్దిలో భాగస్వాములను చేస్తున్నాయన్నారు. తద్వారా నాటి ఎస్‌కేడే కలలు కన్న పంచాయతీరాజ్ సహకార వ్యవస్థ లక్ష్యాలను సాధించడంలో తెలంగాణ ప్రభుత్వం ముందంజలో వున్నదని సీఎం కేసీఆర్ తెలిపారు. 

Related Posts