YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

రైతుల ఉపయోగార్థం కాల్ సెంటర్ ప్రారంభం

రైతుల ఉపయోగార్థం కాల్ సెంటర్ ప్రారంభం

రైతుల ఉపయోగార్థం కాల్ సెంటర్ ప్రారంభం
జిల్లా కలెక్టర్ జి. రవి
జగిత్యాల, ఏప్రిల్ 24
యాసంగి 2020-21 పంట చేతికి రానున్న తరుణంలో, అన్నదాతలకు ఆసరగా వారి ఉపయోగార్థం జిల్లాలో కాల్ సెంటర్ ను ప్రారంభించడం జరిగిందని జిల్లా కలెక్టర్ జి. రవి పేర్కోన్నారు. 
శనివారం జిల్లా కార్యాలయాల సముదాయంలోని పౌరసరఫరాల శాఖ వారి ఆద్వర్యంలో వరిదాన్యం కొనుగోలు యాసంగి 2020-21  కాల్ సెంటర్ ను జిల్లా కలెక్టర్ ప్రారంభించారు.  
ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, రైతులు కొనుగోలు కేంద్రాల్లో ఎదురయ్యే ఇబ్బందుల, ఫిర్యాదులు మరియు సందేహల నివృతి చేసుకోవడం కొరకు  1800 425 8187 అనే టోల్ ఫ్రీ నెంబరుకు ఫోన్ చేయవచ్చని పేర్కోన్నారు. 
 కాల్ సెంటర్ కు వచ్చే ప్రతి ఫోన్ కాల్ కు సిబ్బంది సకాలంలో స్పందించి రైతులకు పూర్తి సమాచారాన్ని అందించాలని, ఇట్టి ఫిర్యాదులు సంబంధిత రిజిస్టర్ నందు నమోదు చేయాలని, దాన్యం కొనుగోలలో ఎదుర్కోనే  ఇబ్బందులను తెలుసుకొని, వాటిని సంబంధిత అధికారులకు తెలియజేయాలని ఆదేశించారు. 
జిల్లాలో 116516 హెక్టార్లు (291290 ఎకరాలలో) వరిసాగు జరిగిందని,  ప్రతిహెక్టారుకు 6 టన్నుల చోప్పున 699096 మెట్రిక్ టన్నుల దాన్యం దిగుబడి అంచనా వేయడం జరిగిందని, పౌరసరఫరాల శాఖ ద్వారా 650045 మెట్రిక్ టన్నుల దాన్యాన్ని కొనుగోలు అంచనా వేయడం జరిగిందని పేర్కోన్నారు.
జిల్లాలో ఐకేపి, పిఎసిఎస్, ఎయంసి ల ద్వారా 400 కొనుగోలు కేంద్రాలకు గాను ఈ రోజు వరకు 259 కొనుగోళు కేంద్రాలను ప్రారంభించుకొవడం జరిగిందని, ఈ రోజు వరకు582 మెట్రిక్ టన్నుల దాన్యాన్ని కొనుగోలు చేసి, 222 మెట్రిక్ టన్నుల దాన్యాన్ని  మిల్లులకు రవాణా చేయడం జరిగిందని, తేది 23-04-2021 వరకు కొనుగోలు కేంద్రాల నుండి మిల్లులకు ధాన్యం కేటాయింపు కొరకు 190  ఆర్.ఓ అభ్యర్థనలకు, 179 ఆర్.ఓ కేటాయింపులు జరిగి, 17,900 మెట్రిక్ టన్నుల దాన్యం ఈరోజు వరకు కొనుగోలు కేంద్రాల నుండి మిల్లులకు కేటాయిండం జరిగిందని పేర్కోన్నారు. 
 దాన్యం కొనుగోలులో ఎక్కడ ఎటువంటి లోటుపాట్లు లేకుండా తక్షణ చర్యలను చేపట్టడం జరుగుతుందని, జిల్లావ్యాప్తంగా 1.03 కోట్ల గన్ని సంచులు అందుబాటులో ఉన్నాయని, మరొ 59 లక్షల గన్ని సంచులను తెప్పించడం కొరకు చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలియజేశారు.  58 రైస్ మిల్లులు, ఐదు సెట్టార్లకు గాను 5 ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లను కేటాయించడం జరిగిందని,  జిల్లా వ్యాప్తంగా మౌళిక సదుపాయాలైన టార్పాలిన్ కవర్లు 12442,  ద్యాన్యం శుద్ది యంత్రాలు 398, తేమశాతం కొలిచే యంత్రాలు 680,  ఎలక్ట్రానిక్ తూకం యంత్రాలు 772 అందుబాటులో ఉన్నాయని, అవసరాన్ని బట్టి తెప్పించడానికి సన్నాహకాలు చెపట్టడం జరుగుతుందని పేర్కోన్నారు.  
ఈ కార్యక్రమంలో పిడిడిఆర్డిఓ వినోద్ కుమార్, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి చందన్ కుమార్, పౌరసరఫరాలశాఖ సంస్థ అధికారి రజనికాంత్, వ్యవసాయశాఖ అధికారి సురేష్, సహకార శాఖ అధికారి రామానుజాచారి, మార్కెటింగ్ అధికారి ప్రకాశ్,తదితరులు పాల్గోన్నారు.

Related Posts