YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

మే మధ్యనాటికి రోజుకు 8-10 లక్షల కేసులు.

మే మధ్యనాటికి రోజుకు 8-10 లక్షల కేసులు.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 24, 
దేశంలో కోవిడ్ రెండో దశ వ్యాప్తి కలవరానికి గురిచేస్తోంది. మొదటి దశ కంటే ప్రస్తుతం అన్ని రాష్ట్రాల్లోనూ పాజిటివ్ కేసులు రికార్డుస్థాయిలో నిర్ధారణ అవుతున్నాయి. కోవిడ్ రోగులతో ఆస్పత్రుల్లో పడకలు నిండిపోగా.. ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉంది. ప్రపంచంలో మరే దేశంలోనూ ఇప్పటి వరకూ నమోదుకాని రీతిలో రోజువారీ కేసులు భారత్‌లో బయటపడుతున్నాయి. గత మూడు రోజుల నుంచి వరుసగా మూడు లక్షలకుపైగా కేసులు నమోదవుతున్నాయి. అయితే, ఈ సంఖ్య మరింత రెట్టింపవుతుందని అంతర్జాతీయ నిపుణులు హెచ్చరిస్తున్నారు.భారత్‌లో కరోనా విజృంభణ మే ప్రథమార్థంలో గరిష్ఠానికి చేరుతుందని మిచిగన్‌ యూనివర్సిటీ అంటువ్యాధుల విభాగం ప్రొఫెసర్‌ డాక్టర్ భ్రమర్‌ ముఖర్జీ హెచ్చరించారు. అప్పటికల్లా ప్రభుత్వపరంగా వెల్లడించే రోజువారీ కేసుల సంఖ్య 10 లక్షలకు, మరణాలు 5వేలకు చేరే అవకాశం ఉందని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం భారత్‌లో నమోదువుతున్న కేసుల ఆధారంగా ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ హెల్త్‌ మెట్రిక్స్‌ అండ్‌ ఈవేల్యుయేషన్‌ (ఐహెచ్‌ఎంఈ) నమూనా సాయంతో ఆమె విశ్లేషించారు.ఆగస్టు నాటికి ఉద్ధృతి తగ్గుముఖం పడుతుందని ఆమె వివరించారు. ‘‘లెక్కలోకి రానివాటితో కలిసి కలిపి మొత్తం కేసులు మే మధ్యనాటికి గరిష్ఠ స్థాయిలో 45 లక్షలకు చేరొచ్చు. పరిస్థితులు దిగజారితే అది 50 లక్షలకూ చేరే ప్రమాదం ఉంది. భారత్‌లో ప్రస్తుతం రోజుకు 3 లక్షల కేసులు మాత్రమే నమోదువుతున్నట్టు గణాంకాలు వెల్లడిస్తున్నా వాస్తవంగా క్షేత్రస్థాయిలో పరిస్థితులు అంతకంటే దారుణంగా ఉన్నాయి’’ అని ఓ జాతీయ  వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె వ్యాఖ్యానించారు.ఎక్కడికక్కడ కఠినమైన లాక్‌డౌన్‌లు విధించడం, మాస్క్‌లు తప్పనిసరిగా ధరించడం, భారీ సమూహాలను నిషేధించడం, అంతర్రాష్ట్ర ప్రయాణాలు నియంత్రణ, వ్యాక్సినేషన్‌ వేగవంతం చేయడం ద్వారా వైరస్ వ్యాప్తిని తగ్గించవచ్చు. మే నెలలో పాజిటివ్ కేసులు గరిష్ఠానికి చేరినా మళ్లీ సాధారణ జీవితం గడపగలమని విశ్వసించే స్థాయికి కేసులు, మరణాలు తగ్గడానికి మరికొంత సమయం పడుతుంది’’అని అన్నారు.వైరస్‌ జన్యుమార్పుల విశ్లేషణను పెంచడంతోపాటు ప్రజారోగ్య వ్యవస్థను అత్యంత అప్రమత్తం చేసినప్పుడే ఇది సాధ్యమవుతుంది. భారత్‌కు ఇప్పుడు అంతర్జాతీయ సమాజ సహకారం అవసరం. ఆక్సిజన్‌ సరఫరా, వ్యాక్సిన్‌ ఉత్పత్తి పెంచడానికి చర్యలు తీసుకోవాలి.. మే మధ్యనాటికి రోజుకు 8-10 లక్షల కేసులు, 5 వేల మరణాలు నమోదుకావచ్చు.. మే చివరి వరకూ ఇది కొనసాగుతుంది’’ అని ఆమె పేర్కొన్నారు.భారత్‌లో కరోనా రెండో దశ వ్యాప్తి ఉద్ధృతి మే 11-15 మధ్య గరిష్ఠానికి చేరవచ్చని కాన్పూర్, హైదరాబాద్‌ ఐఐటీ నిపుణులు రూపొందించిన గణిత మోడల్ పేర్కొంది. ఆ సమయంలో దేశంలో యాక్టివ్ కేసులు 33-35 లక్షలకు చేరొచ్చని వివరించింది. కాగా, దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 25 లక్షలు దాటాయి. రికవరీల కంటే పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. శుక్రవారం దేశవ్యాప్తంగా 3.46 లక్షలు కేసులు నమోదుకాగా.. 1.37 లక్షల మంది కోలుకున్నారు. చివరి నాటికి తగ్గే అవకాశం నిన్నమొన్నటిదాకా తగ్గినట్టు కనిపించిన కరోనా ఒక్కసారిగా సుడిగాలి వేగంతో ప్రజలపై దండెత్తుతున్నది. ప్రతిరోజూ లక్షల మందిని ఆవహిస్తున్నది. ఊపిరాడనివ్వకుండా ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నది. ఈ సెకండ్‌ వేవ్‌ ఎప్పుడు తగ్గుముఖం పడుతుందనే అంశంపై ఐఐటీ శాస్త్రవేత్తలు స్పష్టతనిచ్చారు. ఇప్పటి వరకు దేశంలో నమోదైన కేసులు, వైరస్‌ నుంచి కోలుకున్నవారి సంఖ్య తదితర లెక్కలను సూత్రీకరించి.. మే రెండోవారానికి గరిష్ఠస్థాయికి చేరుకొని, నెల చివరినాటికి అంతేవేగంతో తగ్గుముఖం పడుతుందని వెల్లడించారు. ప్రస్తుతం 24.28 లక్షలుగా ఉన్న కొవిడ్‌ యాక్టివ్‌ కేసులు మే 15 నాటికి 33 లక్షల నుంచి 35 లక్షల గరిష్ఠస్థాయికి చేరుకుంటాయని వివరించారు. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లో కొత్త కేసుల సంఖ్య ఇప్పటికే గరిష్ఠ స్థాయికి చేరుకోగా, ఏప్రిల్‌ 30 నాటికి ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్‌, తెలంగాణలో కొత్త కేసులు అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. 

Related Posts