కోవిడ్ నిబంధనల నడుమ టీకా పంపిణి
-
జిల్లా కలెక్టర్ జి. రవి
జగిత్యాల, ఏప్రిల్ 24
జిల్లాలో కోవిడ్ టీకా కొరకు కేంద్రాల వద్దకు వచ్చే వారు ఖచ్చితంగా మాస్క్, సామాజిక దూరం వంటి కనీస నింబధలను పాటించేలా చూడాలని జిల్లా కలెక్టర్ జి. రవి సూచించారు. శనివారం గోల్లపెల్లి మండల కేంద్రంలో మరియు జగిత్యాల రూరల్ మండలం కల్లెడ గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఏర్పాటు చేసిన కోవిడ్ టీకా పంపిణి కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ జి. రవి పరిశీలించి వైద్యుల కు, సిబ్బందికి తగు సూచనలు జారీచేశారు. ఈ సందర్బంగా వ్యాక్సినేషన్, కోవిడ్ నిర్దారణ పరీక్షలకు ఎంత మంది వచ్చారో వారి గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేంద్రాల వద్ద ప్రజలు గుంపులుగా లేకుండా సామాజిక దూరాన్ని పాటించేలా చూడాలని,వారికి కనీస మౌలిక వసతులు మంచినీళ్లు నీడ కుర్చీలు శానిటైజర్ లు మొదలగునవి ఏర్పాటుచేసి వారికి అసౌకర్యాలు కలగకుండా చూడాలని, వ్యాక్సిన్ పై వారికి మరియు వారి ద్వారా ఇతరులకు అవగాహన కల్పించాలని సూచించారు. టీకా కొరకు వచ్చిన వివరాను కొవిన్ యాప్ లో నమోదు చేయాలని, తద్వారా వారి ఫోన్ లకు వచ్చే సంక్షిప్త సందేశాల ద్వారా వారు టీకా వివరాలను గురించి తెలుసుకునే అవకాశం ఉంటుందని పేర్కోన్నారు. ఈ పర్యటనలో జగిత్యాల ఆర్డిఓ శ్రీమతి మాదురి, డిప్యూటి డిఎంఆండ్ హెచ్ఓ జైపాల్ రెడ్డి, ఇతర అధికారులు, తదితరులు పాల్గోన్నారు.