కరోనాతో 13 మంది జర్నలిస్టులు మృతి
జర్నలిస్ట్ కుటుంబాలకు 10 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి
జగిత్యాల, ఏప్రిల్ 24
తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు 13 మంది జర్నలిస్టులను కరోనా బలితీసుకున్నది.
కరీంనగర్, సిరిసిల్ల, మెదక్,సిద్ధిపేట,
నిజామాబాద్, మేడ్చల్- మల్కాజిగిరి జిల్లాల్లో కరోనా బారినపడి చికిత్స పొందుతూ పదముడు మంది మృతి చెందగా అందులో ఒకరు మహిళా పాత్రికేయురాలు ఉండడం చాలా బాధాకరమని, వారి మృతికి ఆలిండియా వర్కింగ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు, జగిత్యాల ప్రెస్ క్లబ్ 2021 అధ్యక్షులు ఎన్నం కిషన్ రెడ్డి సంతాపం తెలిపారు. కరోనా తో మృతి చెందిన జర్నలిస్ట్ కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించి ఆ కుటుంబాలను ఆదుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ను కిషన్ రెడ్డి కోరారు. జర్నలిస్ట్ ఉద్యమ నేత అమర్ నాథ్, కరీంనగర్ కు చెందిన ప్రజాలక్ష్యం దిన పత్రిక ఎడిటర్ పడకంటి రమేష్, కరీంనగర్ కు చెందిన జర్నలిస్ట్ ప్రకాష్, సిరిసిల్ల జిల్లా వేములవాడ నవ తెలంగాణ రిపోర్టర్ రమేష్, మెదక్ జిల్లాకు చెందిన మహిళా బతుకమ్మ టీవీ ఛానెల్ నిర్వాహకురాలు, సిద్ధిపేట జిల్లా లో ఈనాడు పాత్రికేయులు ఒకరు, డిచ్‌పల్లి టీవీ5 రిపోర్టర్ వేణుగోపాల్, ధర్పల్లి సాక్షి రిపోర్టర్ శేఖర్‌కు అదేవిధంగా ఈసీఐఎల్ లో నివాసం ఉంటున్న మెట్రో ఈవెనింగ్ రిపోర్టర్ కాసం గోపీకృష్ణ తో పాటు 13 మంది కరోనాతో పోరాడి చికిత్స పొందుతూ మృతిచేందారని వారి కుటుంబాలకు దేవుడు ధైర్యాన్ని ఇవ్వాలని కోరారు.శనివారం ముగ్గురు చనిపోగా అంతకుముందు 10 మంది వివిధ జిల్లాలకు చెందిన పాత్రికేయులు మృతి చెందారని రాష్ట్ర ప్రభుత్వం ఈ కుటుంబాలను ఆదుకోవాలని కిషన్ రెడ్డి కోరారు. విరిమృతితో కలం కార్మికుల కుటుంబాల్లో విషాదం నింపిందని, ఈ కుటుంబాలకు ప్రభుత్వం 10 లక్షల ఎక్సుగ్రేషియా ప్రకటించాలని కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ కు విజ్ఞప్తి చేశారు.ఈసందర్బంగా జర్నలిస్ట్ లకు సంతాపం ప్రకటిస్తూ, వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు.