YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

అనిల్ దేశ్ ముఖ్ పై సీబీఐ దాడులు

అనిల్ దేశ్ ముఖ్ పై సీబీఐ దాడులు

మహారాష్ట్ర, ఏప్రిల్ 24, 
మహారాష్ట్రలో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ హోంశాఖ మంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌పై సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. అలాగే ఆయన నివాసంతో పాటు ముంబై, నాగ్‌పూర్‌లో పలు చోట్ల శనివారం ఉదయం తనిఖీలు నిర్వహించింది. నెలకు రూ.వంద కోట్లు వసూలు చేయాలంటూ తనపై ఒత్తిడి తీసుకొచ్చారని కొద్ది రోజుల ముంబై మాజీ కమిషనర్ పరమ్ బీర్ సింగ్ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణల నేపథ్యంలో ఈ కేసును సీబీఐకు అప్పగిస్తూ బాంబే హైకోర్టు ఇటీవలే సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి విధితమే. కోర్టు ఆదేశాల మేరకు సీబీఐ అనిల్‌ దేశ్‌ముఖ్‌తో పాటు పలువురిపై ఏప్రిల్‌ 6న ప్రాథమిక విచారణ చేపట్టింది. ఇదిలా ఉండగా, ఏప్రిల్ 14న మాజీ హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్‌ను ఈ కేసులో విచారించిన విషయం విధితమే.ముఖేష్ అంబానీ సెక్యూరిటీ స్కేర్ కేసులో దర్యాప్తులో ‘లోపాలు’ ఉన్నాయని బదిలీ అయిన పరమ్ బిర్ సింగ్, నాడు మంత్రిగా ఉన్న అనిల్ దేశ్ ముఖ్‌పై దోపిడీ, అక్రమ బదిలీలతో సహా పలు ఆరోపణలను సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. ఈ కేసులో సీబీఐ అధికారులు తమ ప్రాథమిక విచారణలో భాగంగా.. అవినీతి కేసుకు సంబంధించి అనిల్ దేశ్ ముఖ్ వ్యక్తిగత సహాయకులు, మాజీ పోలీస్‌ సచిన్ వాజే ఇద్దరు డ్రైవర్లు, బార్ యజమానులు, ముంబై పోలీస్‌ అధికారులు, మాజీ మంత్రికి సన్నిహిత వ్యక్తులను సైతం సీబీఐ ప్రశ్నించింది. తాజా పరిణామాలు మహారాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఓ వైపు కరోనా.. మరో వైపు అవినీతి ఆరోపణలు మహారాష్ట్ర సర్కారుకు తలనొప్పిగా మారాయి.

Related Posts