మదనపల్లి
ఆసియా ఖండంలోనే అతిపెద్ద టమోటో మార్కెట్ గా పేరుగాంచి ఎన్నో సంవత్సరాలుగా టమోటా రైతులకి ఆసరాగా నిలిచిన మదనపల్లి టమోటా మార్కెట్, నేడు టమోటా రేటు పతనం కావడంతో వేలాది మంది రైతుల కు నష్టాలు మిగిల్చింది. లక్షలాది రూపాయల పెట్టుబడులు పెట్టి టమోటా పంటలు దిగుబడి చేసిన రైతులు జీవితాలు ప్రశ్నార్థకం అవుతున్నాయి. బయట రాష్ట్రాలకి దిగుమతి కాకపోవడంతో కరోనా విపత్కర పరిస్థితుల కారణంగా మహారాష్ట్ర బీహార్ కలకత్తా వంటి దూర ప్రాంతాలకు ఎగుమతులు నిలిచిపోవడంతో టమోటా రేట్లు పూర్తిగా పతనం అయ్యాయి. రైతులు పండించిన పంటకు మద్దతు ధర లేకపోవడంతో కూలీలకు రవాణా కు ఖర్చులు చేసిన మొత్తం కూడా టమోటా అమ్మకంతో రాకపోవడంతో పీకల్లోతు కష్టాల్లో రైతులు మునిగిపోయారు. ప్రభుత్వం స్పందించి టమోటా రైతులను ఆదుకోవాలని పలువురు రైతులు వాపోతున్నారు. ,