YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

లోకేష్..ప్రమోషన్ బానే అయిందిగా

లోకేష్..ప్రమోషన్ బానే అయిందిగా

విజయవాడ, ఏప్రిల్ 26, 
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రాజకీయంగా గతంలో ఎన్నడూ లేని విధంగా కష్టాలను ఎదుర్కొంటున్నారు. చంద్రబాబు ముందు ఇప్పుడు అనేక సవాళ్లున్నాయి. ఒకటి పార్టీని వచ్చే ఎన్నికలకు సిద్ధం చేయడం. రెండు తన కుమారుడు లోకేష్ ను ప్రమోట్ చేయడం. ఈ రెండు ఆయన ముందున్న ప్రధాన సమస్యలు. చంద్రబాబు నాయకత్వం విషయంలో ఎవరికీ ఎటువంటి అనుమానం లేదు. ఆయన ఎన్టీఆర్ తర్వాత రెండు సార్లు పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారు.ఎటొచ్చీ నారా లోకేష్ మీదనే నేతల భయమంతా. లోకేష్ రాజకీయంగా ఇంకా పరిణితి చెందలేదు. ప్రజల్లోకి వెళుతున్నా పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నారు. కానీ పార్టీకి లోకేష్ భవిష్యత్ నేత. అందులో ఏమాత్రం సందేహం లేదు. కానీ కిందిస్థాయి క్యాడర్ మాత్రం జూనియర్ ఎన్టీఆర్ రావాలని పదే పదే కోరుతున్నారు. అందుకే చంద్రబాబు తిరుపతి పర్యటనను లోకేష్ కోసం చక్కగా వినియోగించుకున్నారు.లోకేష్ ను అక్కడే ఉండి ప్రచారం చేయాలని చంద్రబాబు ఆదేశించారట. లోకేష్ కోసం స్క్రిప్ట్ లు తయారు చేయడానికి ప్రత్యేక టీంను రూపొందించారట. రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా ఈ టీం సోషల్ మీడియాలోనూ, ప్రసంగాల్లోనూ లోకేష్ కు సహకరిస్తుంది. అందువల్లనే ఇటీవల తిరుపతి ఉప ఎన్నికల్లో లోకేష్ చేసిన ప్రచారంలో పంచ్ లు పడ్డాయంటున్నారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో జగన్ కు విసిరిన సవాల్ ఆ టీం రూపొందించిందేనంటున్నారు.ఇక  సీనియర్ నేతలకు సయితం చంద్రబాబు పరోక్షంగా లోకేష్ ను ప్రమోట్ చేయాలని సూచించారంటున్నారు. అందుకోసమే అచ్చెన్నాయుడు, అయ్యన్న పాత్రుడు వంటి నేతలు లోకేష్ జపం మొదలు పెట్టారంటున్నారు. లోకేష్ సవాల్ కు భయపడే జగన్ తిరుపతి పర్యటన రద్దు చేసుకున్నారని ఈ నేతలు హైలెట్ చేయడం వెనక కూడా చినబాబును ప్రమోట్ చేయడానికే నంటున్నారు. మొత్తం లోకేష్ ను నేతలపై బలవంతంగా రుద్దుతున్నారా? లేదా? అన్నది కాలమే నిర్ణయిస్తుంది

Related Posts