న్యూఢిల్లీ ఏప్రిల్ 26
సునామీలా విరుచుకుపడిన కరోనా సెకండ్ వేవ్ ధాటికి చిగురుటాకులో వణుకుతున్న ఇండియాకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు గూగుల్, మైక్రోసాఫ్ట్ సీఈవోలు సుందర్ పిచాయ్, సత్య నాదెళ్ల. ఇండియా పరిస్థితిపై ఈ ఇద్దరూ ట్విటర్ ద్వారా స్పందించారు. ఇప్పటికే గూగుల్, గూగులర్స్ ద్వారా గివ్ ఇండియా పేరుతో యూనిసెఫ్‌కు రూ.135 కోట్ల సాయం చేసినట్లు సుందర్ పిచాయ్ ట్వీట్ చేశారు.ఇండియాలో కరోనా సృష్టిస్తున్న కల్లోలం తీవ్రంగా కలచివేస్తోంది. గూగుల్, గూగులర్స్ ఇప్పటికే గివ్ ఇండియా పేరుతో అత్యవసర ఔషధాలు, ఇతరాల కోసం యూనిసెఫ్‌కు రూ.135 కోట్లు అందించారు అని సుందర్ పిచాయ్ ట్వీట్ చేశారు.