YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

మినీలాక్ డౌన్ కి కేంద్రం లైన్ క్లియర్..

మినీలాక్ డౌన్ కి కేంద్రం లైన్ క్లియర్..

న్యూ ఢిల్లీ ఏప్రిల్ 26
దేశం లో రెండో దశ కరోనా లో భాగంగా పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. మహమ్మారి బారిన పడి ఇప్పటికే ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. ఆక్సిజన్ అందక చాలామంది అసువులు బాసారు. ఒకరి నుంచి మరొకరి చాలా త్వరగా వ్యాపిస్తోంది. ఈ క్రమంలో పలు రాష్ట్రాల్లో మినీ లాక్ డౌన్ లు కర్ఫ్యూ విధించారు. మే 2 తర్వాత సంపూర్ణ లాక్ డౌన్ ఉంటుదంని ఇటీవల సామాజిక మాధ్యమాల్లో తెగ ప్రచారం జరిగింది. లాక్ డౌన్ పుకార్లపై కేంద్రం ఓ స్పష్టతనిచ్చింది. తాజాగా జారీ చేసిన మార్గదర్శకాలు మినీ లాక్ డౌన్ కు ఊతమిస్తున్నాయి. గడిచిన వారం రోజుల్లో రాష్ట్రాల్లో పది శాతం కన్నా పాజిటివ్ రేటు పెరిగినా... ఆక్సిజన్ కొరత ఐసీయూల్లో 60 శాతానికి పైగా భర్తీ అయితే వెంటనే మినీ లాక్ డౌన్ విధించవచ్చని సూచించింది. నగరాలు పట్టణాలు మున్సిపాలిటీలు పాక్షిక పట్టణ ప్రాంతాలు వార్డులు పంచాయతీలుగా వర్గీకరించి నిబంధనలు పాటించేలా కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. 
రాష్ట్రంలో పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఆక్సిజన్ కొరత ఏర్పడింది. దాదాపు అన్ని ఆస్పత్రుల్లో బాధితులు ఉన్నారు. ఐసీయూలో చేరే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. మరికొన్నాళ్లు ఇలాంటి పరిస్థితులు తలెత్తితే మినీ లాక్ డౌన్ విధించే అవకాశం లేకపోలేదని నిపుణులు అంటున్నారు. లాక్ డౌన్ విధించే అవకాశం ఉన్నందున ఇప్పటి నుంచే అప్రమత్తం కావాలని సూచిస్తున్నారు.ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో రాత్రి కర్ఫ్యూ అమల్లో ఉంది. దీనివల్ల మంచి ఫలితాలే ఉంటాయని అంటున్నారు. తాజాగా కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాల ఆధారంగా పగటిపూట ఆంక్షలు విధించే అవకాశం ఉంది. కానీ గతేడాది మాదిరిగా కఠిన ఆంక్షలు కాకుండా కొన్నింటిని మినహాయించాలని ప్రభుత్వం యోచిస్తోంది. లాక్ డౌన్ తో చాలా నష్టం జరిగిన నేపథ్యంలో దీనిపై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోలేకపోతోందని అన్నారు. పగటి పూట ఆంక్షలపై త్వరలోనే నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.

Related Posts