YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

గుట్కా ముఠా ఆరెస్టు

గుట్కా ముఠా ఆరెస్టు

భువనగిరి
అక్రమంగా గుట్కాను తరలిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేసి రూపాయలు 20 లక్షల విలువ గల 66 గుట్కా సంచులను స్వాధీనం చేసుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణం రాంనగర్ లో లక్ష్మీ కిరాణం వద్ద నిషేధిత గుట్కా, పొగాకు తరలిస్తుండగా విశ్వసనీయ సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వారిని అదుపులోకి తీసుకున్నామని డిసిపి నారాయణ రెడ్డి భువనగిరి లో మీడియా సమావేశంలో వెల్లడించారు. కుమావత్ సురేష్, కుమావత్ రాహుల్ లు సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశ్యంతో బీదర్ నుంచి అక్రమంగా నిషేధిత గుట్కాను హైదరాబాద్ కు తీసుకువచ్చి పలు షాపులకు తరలిస్తున్నారని తెలిపారు. ఫిర్జాదిగూడ లో ఓ ఇంటిని అద్దెకం తీసుకుని గోదాం లాగా చేసి అక్కడి నుంచి వీరి కార్యకలాపాలు కొనసాగిస్తున్నారన్నారు. ఈ క్రమంలోనే భువనగిరి లో లక్ష్మీ కిరాణ షాపు నిర్వహకులు ప్రకాష్ మనరం కు లక్ష్మీ కిరాణ వద్ద కుమావత్ సురేష్, కుమావత్ రాహుల్ లు అక్రమంగా గుట్కా, పొగాకు తరలిస్తుండగా విషయం తెలుసుకున్న పోలీసులు ఆ ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. అదేవిధంగా ఫిర్జాదిగూడ గోదాం పై రైడ్ చేసామని పేర్కొన్నారు. స్వాగత్, సాగర్, రాజకేని, ఆర్ఆర్, విమల్ , మిరాజ్ గుట్కా ప్యాకెట్లను తరలిస్తున్నారని అన్నారు. వారి వద్ద నుంచి రూపాయలు 20 లక్షల విలువ చేసే 66 గుట్కా సంచులను, స్విఫ్ట్ డిజైర్ కొత్త కారు,  మూడు సెల్ ఫోన్ లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.

Related Posts