YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విదేశీయం

బాగ్దాద్ లో విషాదం.. ఆస్పత్రిలో ఆక్సిజన్ ట్యాంక్ పేలి 82 మంది సజీవ దహనం

బాగ్దాద్ లో విషాదం.. ఆస్పత్రిలో ఆక్సిజన్ ట్యాంక్ పేలి 82 మంది సజీవ దహనం

న్యూ ఢిల్లీ ఏప్రిల్ 26
ఇరాక్ రాజధాని బాగ్దాద్ లో విషాదం చోటు చేసుకుంది. కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్న ఖాతీబ్ ఆస్పత్రిలో ఆక్సిజన్ ట్యాంక్ పేలి మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 82 మంది సజీవ దహనమయ్యారు. శనివారం రాత్రి జరిగిన ఈ అగ్నిప్రమాదంలో మరో వంద మంది తీవ్రంగా గాయపడ్డారు.ఆస్పత్రిలో మంటలు చెలరేగి క్రమంగా ఆక్సిజన్ ట్యాంక్ వద్దకు వ్యాపించి ఘోర అగ్ని ప్రమాదంగా మారిందని ఆ దేశ అధికారులు తెలిపారు. ఆస్పత్రి ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో తొలుత మంటలు వ్యాపించాయని వెల్లడించారు. ఆదివారం ఉదయం నాటికి అదుపులోకి తెచ్చినట్లు పేర్కొన్నారు.ప్రమాదం జరిగిన సమయంలో ఐసీయూలో 30 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారని వివరించారు. వారందరినీ వేరే ఆస్పత్రులకు తరలించినట్లు వెల్లడించారు.  ఈ ఘటనపై సత్వర విచారణ చేపట్టాలని ఆ దేశ ప్రధాని ముస్తఫ్ అల్ ఖాదిమి ఆదేశించారు.
మంటలు చెలరేగిన సమయంలో ప్రజలు ప్రాణ భయంతో ఆస్పత్రి నుంచి బయటకు పరుగులు తీస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో దర్శనమిచ్చాయి. మరోవైపు అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పుతున్న ఫొటోలు వైరల్ గా మారాయి.ఫిబ్రవరి నుంచి ఆ దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటివరకు 10 లక్షల పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆ దేశ అధికారులు వెల్లడించారు. మార్చిలో టీకా పంపిణీ కార్యక్రమం షురూ చేశారు. ఇప్పటివరకు 650000 మందికి వ్యాక్సిన్ ఇచ్చినట్లు తెలిపారు.

Related Posts