YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

న్యూలుక్ లో చినబాబు

న్యూలుక్ లో చినబాబు

గుంటూరు, ఏప్రిల్ 27, 
మొత్తానికి చినబాబు వాళ్ళ బావ జూనియర్ ఎన్టీయార్ బాట పట్టేలా కనిపిస్తోంది. ఎంతైనా సీనియర్ ఎన్టీయార్ మనవడే కదా. అందుకే ఇక రాజకీయాల్లో కూడా మేకోవర్ అవసరమని లోకేష్ గ్రహించారు అంటున్నారు. అదే విధంగా తాత ఎన్టీయార్ వేష భాషల ద్వారానే జనాలను ఆకట్టుకున్నారు. ఇపుడు చినబాబు కూడా అదే థియేరీని ఫాలో అవాలని చూస్తున్నారుట. మామూలుగా లోకేష్ ఫేస్ చూస్తే సాఫ్ట్ గా ఉంటుంది. పైగా ఆయన చినబాబు అంటే అచ్చం అలాగే అనిపిస్తారు, కనిపిస్తారు. కానీ ఇకపైన టోటల్ బాడీ లాంగ్వేజ్ తో పాటు మాట్లాడే లాంగ్వేజ్ కూడా చేంజ్ చేయాలనుకుంటున్నారుట లోకేష్.ఏ రాజకీయనాయకుడికి అయినా యూత్ ఒక వరం. యువతను పట్టుకుంటే ఇక విజయం దక్కినట్లే. లోకేష్ వయసు రిత్యా చూస్తే పొలిటికల్ గా పక్కా యూత్. అయినా ఆయన ఎందుకో యువతను మాత్రం ఆకర్షించలేకపోతున్నారు. దానికి తన వేష భాషలు కూడా ఒక ప్రధాన కారణం అని లోకేష్ ఎట్టకేలకు డిసైడ్ అయ్యారుట. అందుకే మీసాలు తీసేసి సాఫ్ట్ వేర్ బాయ్ గా స్మార్ట్ గా కనిపించే లోకేష్ ఇక పైన అందమైన మీసకట్టుతో పాటు ట్రిమ్ చేసిన గడ్డంతో జనాలకు కనిపించాలనుకుంటున్నారుట. దాని వల్ల యూత్ తో ఈజీగా కనెక్ట్ కావడమే కాకుండా మంచి ఫాలోయింగ్ కూడా ఏర్పడుతుంది అని ఆలోచిస్తున్నారుట. పైగా ఇపుడు యూత్ అంటే గడ్డం పెంచడమే ట్రెండ్.మొత్తానికి రూపం ఆకట్టుకునేలా ఉంటే జనాలు కాస్తా ఆగి చూస్తారు. ఆ మీదట చెప్పాల్సిన విషయం ఏదైనా వారి చెవిలో వేయవచ్చు. ఇంతకాలం లోకేష్ ని విపక్షాలు పప్పు అంటే తాను కూడా ఎలాంటి మార్పూ లేకుండా అలాగే ఉండిపోతూ వచ్చాడు. కానీ ఇపుడిపుడే తన మాటలకు చినబాబు పదును పెడుతున్నాడు. అంతే కాదు, ఇపుడు వేషాన్ని కూడా మార్చేస్తే కచ్చితంగా న్యూ లుక్ తో కొత్త రకం పాలిటిక్స్ చేసేందుకు అవకాశం ఉంటుంది అంటున్నారు. ఇప్పటికే జాతీయ స్థాయిలో పప్పుగా పిలిపించుకునే రాహుల్ గాంధీ కూడా మేకోవర్ అంటూ టోటల్ చేంజ్ అయ్యారు. పైగా ఆయన కూడా పంచులతో సెటైర్లతో మోడీ సర్కార్ ని అల్లాల్లాడిస్తున్నారు. ఇపుడు లోకేష్ కూడా అదే రూట్లో ఉన్నారని అంటున్నారు. లోకేష్ నుచూడడానికి బాగానే ఉంటారు. ఈ మధ్యనే ఆయన డైటింగ్ వంటివి పాటిస్తూ సన్నబడే ప్రయత్నం చేస్తున్నారు. ఇపుడు మీసకట్టుతో ట్రిమ్ చేసిన గడ్డం తో లుక్ ఇస్తే జనాలు పరేషాన్ అవడం గ్యారంటీ అంటున్నారు. రోజులు ఎల్లపుడూ ఒకేలా ఉండవు. ఏపీలో చూసుకుంటే వైసీపీ మీద విసుగుపుడితే వెంటనే గుర్తుకు వచ్చేది టీడీపీయే. ఇక అక్కడ చంద్రబాబుని జనాలు చూసేశారు. లోకేష్ ఏమైనా ఎదిగివస్తే ఆయనను ఆదరించేందుకు కూడా ఏపీ ప్రజానీకం రెడీ. దానికి తగిన మార్పు చేర్పులకు చినబాబు సిద్ధపడితే సింహాసనం అందడం పెద్ద కష్టమేమీ కాదు. మొత్తానికి మాస్ యూత్ పల్స్ ని పట్టేందుకు లోకేష్ రెడీ అవుతున్నట్లే లెక్క.

Related Posts