YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

చంద్రబాబు బాటలో జగన్

చంద్రబాబు బాటలో జగన్

తిరుపతి, ఏప్రిల్ 27, 
జగన్ కూడా అచ్చం చంద్రబాబు బాటలో నడుస్తున్నారా అన్న అనుమానాలు అయితే అందరిలో పెరిగిపోతున్నాయి. చంద్రబాబు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నపుడు తానూ తన వారూ అనుకోబట్టే  ఆయనకు ఎవరూ లేకుండా పోయారు. మరి ఇంతా తెలిసి కూడా జగన్ ఎందుకు ఇలా చేస్తున్నారు అన్నదే అంతుపట్టని విషయం. అయితే అధికారం మత్తు మరిగాక అందరూ ఒకటేనా అన్న చర్చ మాత్రం సాగుతోంది. ఇంతకీ విషయం ఏంటి అంటే నాడు చంద్రబాబు తన సొంత హెరిటేజ్ డైరీ కోసం చిత్తూరు జిల్లాలో మొత్తం ఇతర ప్రభుత్వ డైరీలను తొక్కేసి నష్టాల బాట పట్టించి మూసేయించారు అన్న విమర్శలు ఎదుర్కొన్నారు.ఇక జగన్ సైతం తన సొంత జిల్లా కడపలో ఇప్పటికి 13 ఏళ్ళ క్రితం స్థాపించిన భారతీ సిమెంట్స్ ఎదుగుదల కోసం ఇదే జిల్లాలో ఉన్న మరో పెద్ద సిమెంట్ పరిశ్రమను తొక్కేయాలను కుంటున్నారని ప్రచారం అయితే విపక్షాల నుంచి వస్తోంది. కడపలో అతి పెద్ద సిమెంట్ ఫ్యాక్టరీగా దాదాపు రెండు దశాబ్దాలకు పైగా ఉన్న పరిశ్రమ జువారీ సిమెంట్స్. ఇది కేవలం జిల్లాలోనే కాదు ఏపీలోనే అతి పెద్ద పరిశ్రమ. ఇక్కడ ఏడాదికి 4,500 మెట్రిక్ టన్నుల సిమెంట్ ఉత్పత్తి జరుగుతుంది. అలాగే మూడు వేల మంది దాకా కార్మికులు ఇక్కడ పనిచేస్తారు. ఇక అంతర్జాతీయ కంపెనీ అయిన హేడెల్బర్గ్ సిమెంట్ కంపెనీలో ఇది ఒక భాగం. అలాంటి కంపెనీని తొక్కేయాలనుకుంటే ముందుగా కడప జిల్లాకే ఇబ్బంది మరి.జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తరువాత నుంచి జువారీ కంపీనీకి ఇబ్బందులు మొదలయ్యాయి అంటున్నారు. ఈ కంపెనీలో వాటా తీసుకోవడానికి భారతీ సిమెంట్స్ వారు ప్రయత్నాలు చేసినా అవి కొలిక్కి రాకపోవడంతో ఇపుడు అధికారం ఉపయోగించి మరీ అన్ని రకాలుగా జువారీ మీద సవారీ చేస్తున్నారు అంటున్నారు. ఈ కంపెనీకి పర్యావరణం సమస్యలు సాకుగా చూపిస్తున్నారుట. అంతే కాదు, విద్యుత్ ని కూడా నిలిపేయాలని ఆదేశాలు వెళ్లాయని అంటున్నారు. మొత్తానికి ఏపీలోనే ఏనుగు లాంటి ఈ కంపెనీ కనుక మూత పడితే అది నేరుగా జగన్ కే అప్రతిష్ట అంటున్నారు.వ్యాపారంలో ఏకస్వామ్యం చేయాలని అంతా భావిస్తారు. కానీ రాజకీయాల్లో ఉన్న వారికి అందరూ సమానమే. ఒక తండ్రిలా రాష్ట్రాన్ని పాలించాలి. తన పర భేదాలు అన్నవి అసలు ఉండరాదు, కడప లాంటి వెనకబడిన జిల్లాకు ఇంత పెద్ద కంపెనీ రావడమే గొప్ప. ఇక జగన్ ఫ్యామిలీ కూడా మరో సిమెంట్ కంపెనీ అక్కడ పెట్టింది. దీని వల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. మరిన్ని కంపెనీలను కూడా జిల్లాకు తీసుకురావాల్సింది పోయి ఉన్న వాటిని ఆర్పేస్తే వ్యాపారంలో విజేతలు అవుతారేమో కానీ రాజకీయాల్లో చెడ్డ పేరే అంటున్నారు. మరి ఇప్పటికే దీని మీద విపక్షాలు పెద్ద గొంతు చేసుకుంటున్నాయి. ఈ విషయంలో ప్రభుత్వం జువారీ సిమెంట్ పరిశ్రమకు అన్ని విధాలుగా అండదండగా ఉండాలని అంతా కోరుతున్నారు. అపుడే బాబుకూ జగన్ కి తేడా కచ్చితంగా ఉంటుందని కూడా అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.

Related Posts