YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

రెబల్ ఎంపీ ధైర్యం ఏంటీ

రెబల్ ఎంపీ ధైర్యం ఏంటీ

ఏలూరు, ఏప్రిల్ 27,
వైసీపీ రెబ‌ల్ ఎంపీ.. క‌నుమూరి ర‌ఘురామ‌కృష్ణంరాజుపై అనేక వ్యాఖ్యలు సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. సొంత ఇంటికే వాసాలు లెక్క పెడుతున్నార‌ని.. పార్టీ టికెట్ ఇచ్చి.. గెలుపున‌కు ఊతంగా మారిన సొంత పార్టీ అధినేత జ‌గ‌న్‌పైనే ఆయ‌న కేసులు వేస్తున్నార‌ని పెద్ద ఎత్తున విమ‌ర్శలు వ‌స్తున్నాయి. నిజానికి ఆయ‌న ఏడాది కాలంగా విమ‌ర్శలు చేస్తున్నా.. అంతో ఇంతో ఆయ‌న‌ను స‌పోర్టు చేసిన వారు ఉన్నారు. న‌ర‌సాపురంలోనూ ఆయ‌న అభిమానులు దీనిని స‌మ‌ర్ధించుకున్నారు. కానీ, ఇప్పుడు ఏకంగా జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు కోరుతూ కోర్టుకు ఎక్కడాన్ని అభిమానులు సైతం తిప్పికొడుతున్నారు.ఈ ప‌రిణామం మంచిది కాద‌ని.. ఈ త‌ర‌హా రాజకీయాలు చేసే నేత‌ల‌ను ఏ పార్టీ కూడా స‌హించ‌ద‌ని.. ఇప్పుడు జ‌గ‌న్‌పై వ్యతిరేక‌త‌తో ర‌ఘురామ‌కృష్ణంరాజును స‌మ‌ర్ధిస్తున్న పార్టీలు కానీ.. ప‌త్రిక‌లు కానీ.. రేపుఎన్నిక‌ల స‌మ‌యానికి యూట‌ర్న్ తీసుకుంటే.. ర‌ఘురామ‌కృష్ణంరాజు ప‌రిస్థితి ఇబ్బందిగా మారుతుంద‌ని అభిమానులే అంటున్నారు. తాజాగా న‌ర‌సాపురంలో ఎంపీ క‌నుబ‌డుట లేదు.. అనే పోస్టర్లు వెలిసాయి. అయితే.. దీని వెనుక వైసీపీ నేత‌లు, ముఖ్యంగా త‌న‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నవారు చేస్తున్న కుట్ర‌లో భాగ‌మేన‌ని ర‌ఘురామ‌కృష్ణంరాజు అంటున్నారు. కానీ, దీనివెనుక మ‌రో పార్టీ నేత‌లు కూడా ఉన్నార‌నే విష‌యం ఆల‌స్యంగా వెలుగు చూసింది.వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇక్కడ నుంచి విజ‌యం ద‌క్కించుకునేందుకు ఎదురు చూస్తున్న ఒక‌టి రెండు పార్టీలు. ఇప్పుడు ర‌ఘురామ‌కృష్ణంరాజు ను రెచ్చగొడుతున్నార‌ని.. వారి వ‌ల‌లో ఆయ‌న పూర్తిగా చిక్కుకు పోయార‌ని అభిమాన‌లు ఆవేద‌న వ్యక్తం చేస్తున్నారు. స‌హ‌జంగా ఏ పార్టీలో అయినా.. నేత‌ల‌కు, పార్టీ అధిష్టానానికి మ‌ధ్య అసంతృప్తులు ఉంటాయ‌ని.. అంత మాత్రాన పార్టీ ప‌రువును, అధినేత ప‌రువును ఎవ‌రూ కూడా ఈ రేంజ్‌లో బ‌య‌ట‌కు లాగిన సంద‌ర్భాలు లేవన్న చ‌ర్చలు కూడా స్థానికంగా వినిపిస్తున్నాయి.ఇప్పుడు ర‌ఘురామ‌కృష్ణంరాజు పూర్తిగా గీత దాటేస్తున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంద‌ని.. ఇది ఆయ‌న భవిష్యత్తుకు మంచిది కాద‌ని సూచిస్తున్నారు. ఇప్పటికైనా ఆయ‌న రాజీ మార్గం వెతికితే.. మంచిద‌నే సూచ‌న‌లు వ‌స్తున్నాయి. అయితే.. దీనికి ఆయ‌న అంగీక‌రించే ప‌రిస్థితి లేదు. పోనీ.. సైలెంట్‌గా ఉంటే.. మున్ముందు ఏపార్టీ అయినా.. టికెట్ ఇచ్చే అవ‌కాశం ఉంటుంద‌ని అంటున్నారు. మ‌రి ఏం చేస్తారో చూడాలి.

Related Posts