YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

నారాయణ మళ్లీ యాక్టివ్

నారాయణ మళ్లీ యాక్టివ్

నెల్లూరు , ఏప్రిల్ 27, 
మాజీ మంత్రి నారాయణ మళ్లీ యాక్టివ్ అయ్యేటట్లే కన్పిస్తున్నారు. పార్టీకి ఇప్పటి వరకూ దూరంగా ఉన్న నారాయణ సీఐడీ కేసుతో తిరిగి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే అవకాశముంది. మాజీ మంత్రి నారాయణపై సీఐడీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అమరావతి రాజధాని భూముల వ్యవహారంలో దళితుల అసైన్డ్ భూముల్లో తీసుకున్న నిర్ణయాలను తప్పు పడుతూ సీఐడీ నారాయణపై కేసు నమోదు చేసింది.ఇప్పటివరకూ మాజీ మంత్రి నారాయణ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. గత ఇరవై నెలలుగా తమ విద్యాసంస్థల పైనే ఆయన దృష్టి పెట్టారు. జగన్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతుందని భావించిన నారాయణ నెల్లూరులో పట్టణ నియోజకవర్గ కార్యక్రమాల్లో కూడా పెద్దగా పాల్గొనడం లేదు. టీడీపీ అధినేత చంద్రబాబు నెల్లూరుకు వచ్చినప్పుడు మాత్రం కేవలం హాజరై మమ అనిపించుకుని వెళుతున్నారు.నారాయణకు రెండు తెలుగు రాష్ట్రాల్లో విద్యాసంస్థలు ఉండటంతో టీడీపీ అధినేత చంద్రబాబు సయితం చూసీ చూడనట్లు వదిలేశారు. నారాయణ పోటీ చేసి ఓటమి పాలయిన నెల్లూరు పట్టణ నియోజకవర్గానికి ఇన్ ఛార్జిని కూడా నియమించారు. అయితే కేసులకు భయపడే ఇన్నాళ్లూ నారాయణ పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు. ఇక సీఐడీ కేసు నమోదు చేయడం, తన ఇళ్లల్లోనూ, వ్యాపారసంస్థల్లోనూ సోదాలు జరగడంతో నారాయణ అసహనం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.ఇన్నాళ్లూ పార్టీకి దూరంగా ఉన్నప్పటికీ తనపై అక్రమ కేసులను బనాయించేందుకే ప్రభుత్వం ప్రయత్నిస్తుందని భావించిన నారాయణ ఇకపై పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటానని అధినాయకత్వానికి సంకేతాలు పంపినట్లు తెలిసింది. ఎటూ అయిన కేసులు నమోదయ్యాయి. ఇక పార్టీని కూడా వదిలేసుకోవడం వృధా అని భావించిన నారాయణ నెల్లూరు నుంచే తిరిగి పార్టీ కార్యక్రమాలను త్వరలో ప్రారంభిస్తారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. మొత్తం మీద నారాయణపై సీఐడీ కేసు బాగానే పనిచేసిందంటున్నారు టీడీపీ నేతలు

Related Posts