YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

దినకరన్, విజయ్ కాంత్ షట్ డౌనేనా

దినకరన్, విజయ్ కాంత్ షట్ డౌనేనా

చెన్నై, ఏప్రిల్ 27, 
మిళనాడు ఎన్నికలు పూర్తయ్యాయి. ఈ ఎన్నికలతో రెండు పార్టీల కధ ముగిసిపోతుందంటున్నారు. వచ్చే ఎన్నికల నాటికి ఈ పార్టీల మనుగడ కూడా కష్టసాధ్యమేనన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. తమిళనాడు ఎన్నికల ఫలితాలను బట్టి ఈ రెండు ప్రాంతీయ పార్టీల భవిష్యత్ తేలిపోనుంది. ఒకటి విజయ్ కాంత్ సారధ్యంలోని డీఎండీకే కాగా, మరొకటి టీటీవీ దినకరన్ నేతృత్వంలోని అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం.ఈ రెండు పార్టీలు ఇప్పుడు కూటమిగా ఏర్పడి తమిళనాడులోని 234 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేశాయి. అయితే ఈ రెండు పార్టీలు ఏ మేరకు ప్రభావం చూపుతాయన్నది ఆసక్తికరంగా మారింది. ప్రధాన పోటీ డీఎంకే, అన్నాడీఎంకేల మధ్యనే ప్రధాన పోటీ జరుగుతుండటంతో ఇవి పెద్దగా పెర్ ఫార్మెన్స్ చూపే అవకాశాలు లేవంటున్నారు. ఇందుకు ప్రధాన కారణం ఈ రెండు పార్టీల నాయకత్వంపై నమ్మకం లేకపోవడమే.విజయ్ కాంత్ తన పార్టీని స్థాపించిన తర్వాత తమిళనాడు లో ఒక్కసారే ప్రభావం చూపగలిగారు. గత ఎన్నికలలో జయలలిత సారథ్యంలోని అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకుని బరిలోకి దిగడం వల్ల కొంత సానుకూలత వచ్చినా, ఈసారి ఆ అవకాశాలు లేవు. విజయకాంత్ అనారోగ్యంతో ప్రచారంలోనే పాల్గొన లేకపోయారు. విజయ్ కాంత్ సతీమణి ప్రేమలత మాత్రమే ప్రచారంలో పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో ఏమాత్రం తగినన్ని స్థానాలు రాకపోయినా వచ్చే ఎన్నికల నాటికి పార్టీని మూసివేయడం ఖాయంగా కన్పిస్తుంది.దినకరన్ కు చెందిన అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం పార్టీ పరిస్థితి కూడా తమిళనాడులో అంతే. అన్నాడీఎంకే నుంచి బయటకు వచ్చిన తర్వాత జరిగిన ఎన్నికల్లో ఒక్క దినకరన్ మాత్రమే గెలుపొందారు. ఆ తర్వాత జరిగిన ఏ ఎన్నికలలోనూ దినకరన్ ప్రభావం చూపలేకపోయారు. శశికళ కూడా అన్నాడీఎంకే పై ఉన్న మక్కువ కారణంగా దినకరన్ కు సహకరించలేదు. దీంతో ఈ ఎన్నికల్లో కనీస స్థానాలను సంపాదించకపోతే వచ్చే ఎన్నికల నాటికి పార్టీని క్లోజ్ చేయడం ఖాయంగా కన్పిస్తుంది. ఈసారి తమిళనాడు ఎన్నికలు రెండు పార్టీల భవిష్యత్ ను నిర్ణయిస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు.

Related Posts