YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ఎమ్మెస్సార్ భౌతికకాయాన్ని సందర్శించిన మంత్రి ఈటల

ఎమ్మెస్సార్ భౌతికకాయాన్ని సందర్శించిన మంత్రి ఈటల

హైదరాబాద్
నిమ్స్ లో మాజీ మంత్రి ఎం సత్యనారాయణ భౌతికకాయాన్ని  వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ సందర్శించారు. తరువాత మంత్రి మాట్లాడుతూ సత్యనారాయణ గారు 60 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగి, రాష్ట్ర రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు కరీంనగర్ ప్రజలు హృదయాల్లో స్థిరమైన స్థానాన్ని సంపాదించుకుని ఈరోజు పరమపదించడం చాలా బాధాకరం. తెలంగాణ రాష్ట్రం ఒక మంచి నీతివంతమైన రాజకీయ నాయకున్ని, గొప్ప అనుభవం ఉన్న నాయకునీ కోల్పోయింది అని భావిస్తున్న అని అన్నారు.
1969 లో జరిగిన తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పాల్గొనడమే కాకుండా ఎన్నికలలో పోటీ చేసి నెగ్గారు. మొదటి నుండి ఎథిక్స్ వ్యాల్యూస్ తో కూడిన రాజకీయాలు ఉండాలని, రాజకీయాల్ని ప్రజపరం చేయాలని తపనపడిన వారని అన్నారు.
కాంగ్రెస్ పార్టీలో కీలకమైన స్థానంలో ఉండి కూడా జిల్లా ప్రజలను  మరవనటువంటి వ్యక్తి సత్యనారాయణ అని అన్నారు. 2004లో కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ పొత్తు లో కీలక పాత్ర పోషించారు. వారి తో పాటుగా మేము కూడా 2004 లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయన  దేవాదాయ శాఖ మంత్రిగా జిల్లాకు ఎనలేని సేవలు చేశారు. ఎంత ఎత్తుకు ఎదిగినా ఎంత ఉన్నత స్థానంలో ఉన్న తెలిసిన మనుషుల పై ప్రేమ మానవత్వం చూపేవారు. అయన  కరోనాతో మృతి చెందడం చాలా బాధాకరం. అయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. అయన ఆత్మకు శాంతి కలగాలని అని కోరుకుంటున్నానని అన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్, అయనకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలని ఆదేశించారు. మూడున్నర నాలుగు గంటల మధ్య మహాప్రస్థానంలో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరుగుతాయి అని మంత్రి అన్నారు.

Related Posts