YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

ఆచారి అమెరికా యాత్ర రివ్యూ

ఆచారి అమెరికా యాత్ర రివ్యూ

నటీనటులు: మంచు విష్ణు, ప్రగ్యా జైశ్వాల్‌, బ్రహ్మానందం, కోటా శ్రీనివాస రావు, ప్రభాస్‌ శ్రీను, పోసాని కృష్ణమురళి, ప్రదీప్‌ రావత్‌, పృథ్వీ, సత్య కృష్ణన్‌ 

మ్యాజిక్: ఎస్‌.ఎస్‌ తమన్‌

ప్రొడ్యూసర్: కిట్టు

స్క్రీన్‌ ప్లే, డైరెక్షన్: నాగేశ్వర రెడ్డి

కొంతకాలంగా మంచు విష్ణుకు సరైన హిట్లు లేవు. ఆఖరిగా ‘గాయత్రి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా ఆ సినిమాలో గెస్ట్ రోల్ కే పరిమితమయ్యారు. ఇప్పుడు ‘ఆచారి అమెరికా యాత్ర’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. గతంలో ‘దేనికైనా రెడీ’ చిత్రంలో పూజార్లుగా అలరించన విష్ణు, బ్రహ్మానందం ఇప్పుడు మరోసారి అదే పాత్రలతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. మరి ఈ ఇద్దరికి మరో హిట్ వచ్చిందా? పంతుళ్లకు అమెరికాకు సంబంధం ఏంటి? 

స్టోరీ: అప్పలాచార్య (బ్రహ్మానందం), తోటి అర్చక బృందంతో కలిసి హోమాలు, వ్రతాలు జరుపుతుంటాడు కృష్ణమాచార్య(మంచు విష్ణు). ఒక పెద్దాయన(కోట శ్రీనివాస్‌రావు) ఇంట్లో పూజలు చేస్తుండగా.. అమెరికా నుంచి వచ్చిన రేణుక(ప్రగ్యా జైశ్వాల్‌)ను ప్రేమిస్తాడు. ఇంతలో హోమం వద్ద  జరిగిన ఘటనతో అర్చక బృందం ప్రమాదంలో పడుతుంది. ప్రాణాలు కాపాడుకునేందుకు కృష్ణమాచార్య తన గురువు అప్పలాచార్యను ఒప్పించి అమెరికాకు బయలుదేరతాడు. మరి అక్కడికి వెళ్లాక ఏం జరిగింది?  వాళ్లకు సమస్యలు ఎదురవడానికి కారణం ఏంటి? కృష్ణమాచార్య, రేణుక లవ్ సక్సెస్ అయిందా? లేదా? అనేది తెరపై చూడాలి.

ఎలా ఉంది:  నవ్వులు పండించేందుకు అనువైన స్టోరీ ఇది.. కాని స్టోరీ పక్కదారి పట్టింది. స్టోరీ మొత్తం ఉండాల్సిన నవ్వులు అక్కడక్కడే కనిపిస్తయి. లాజిక్ లేకుండా సీన్లన్నీ సాగిపోతాయి. దీంతో స్టోరీలో సీరియస్ నెస్ కామెడీ  రెండూ తగ్గాయి. ప్రారంభం అంతా సాదాసీదాగానే సాగుతుంది. ఆచారి టీమ్  అమెరికా షిఫ్ట్ అయిన తర్వాత కాస్త నవ్వులు కనిపిస్తాయి.  బ్రహ్మానందం, సత్య కృష్ణన్‌ల కామెడీ ట్రాక్‌లతో పాటు విష్ణు, ప్రభాస్‌ శ్రీను, ప్రవీణ్‌ తదితరులు చేసే సందడితో స్టోరీ పరుగెడుతుంది.  అమెరికాలో ఆచారి బృందాన్ని విలన్ టీమ్ మెంటాడే సీన్ నుంచి సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతుంది. రేణుకకి తన వాళ్లతోనే పొంచి ఉన్న ముప్పు నుంచి కృష్ణమాచార్య తన తెలివి తేటలతో కాపాడే విధానం..దేశం కాని దేశంలో విలన్ నుంచి తప్పించుకునేందుకు ఆచార్య బృందం పడే ఆపసోపాలు నవ్వులు పంచుతాయి. ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సెకండ్ హాఫ్ లో కామెడీ తగ్గింది. పృథ్వీతో పాటు మరికొన్ని కొత్త పాత్రలు తెరపైకి వచ్చినా క్లైమాక్స్ నిరాశపరుస్తుంది.

ఎలా చేశారు:  ఇంతకుముందు చేసినా.. పూజారుల పాత్రలో బ్రహ్మానందం, విష్ణు చేసిన సందడు బావుంది. ప్రగ్యా జైశ్వాల్‌ గ్లామర్ గా కనిపించింది. పోసాని కృష్ణమురళి, పృథ్వీ, సురేఖా వాణి, సత్య కృష్ణన్‌, ప్రవీణ్‌, ప్రభాస్‌ శ్రీను పాత్రల పరిధి మేరకు ఆకట్టుకున్నారు. ప్రదీప్‌ రావత్, ఠాకూర్‌ అనూప్‌  సింగ్ విలన్లుగా ఫర్వాలేదనిపించారు. టెక్నికల్ గా  సినిమా బాగుంది. సిద్ధార్థ్‌ కెమెరా అటు అమెరికా అందాలను, ఇటు భారత్‌ అందాలను చక్కగా చూపించింది. తమన్‌ పాటలు బాగున్నాయి. దర్శకుడు నాగేశ్వరరెడ్డి తనకి కామెడీ పైన మంచి పట్టు ఉన్నప్పటికీ ఈ సినిమాలో ఆ ప్రభావం పెద్దగా కన్పించలేదు.

ప్లస్ పాయింట్స్:

+ విష్ణు, బ్రహ్మానందం కామెడీ

+ ప్రగ్యా జైశ్వాల్‌ గ్లామర్                         

మైనస్ పాయింట్స్:

స్టోరీ స్క్రీన్ ప్లే

Related Posts