విజయవాడ ఏప్రిల్ 27
సెకండ్ వేవ్ లో ఆంధ్రప్రదేశ్ ప్రజలను కరోనా వైరస్ వణికిస్తోంది. ప్రభుత్వం కరోనా కట్టడి కోసం తీసుకుంటున్న చర్యలేవి కూడా కరోనా కి అడ్డుకట్ట వేయలేకపోతున్నాయి. దీనితో రాష్ట్ర వాసుల్లో ఆందోళన మొదలైంది. రాష్ట్రంలో ఆ జిల్లా ఈ జిల్లా అన్న తేడా లేకుండా ప్రతి జిల్లాలో కూడా కరోనా కేసులు భారీగా పెరిగిపోయాయి. దీనితో ఇప్పటికే పలు నగరాలని కంటైన్మెంట్ జోన్స్ గా ప్రకటించారు. అలాగే అక్కడ కరోనా వ్యాప్తి ఎక్కువగా జరగకుండా కఠినమైన ఆంక్షలు అమలు చేస్తున్నారు. అలాగే ప్రజలు కూడా స్వీయ నియంత్రణ ను ఫాలో అవుతూ అత్యవసరం అయితే తప్ప ఇంటి నుండి బయటకి రాకండి అని చెప్తున్నారు.ఈ నేసథ్యంలో విజయవాడలోని ముఠా కార్మికులు వ్యాపారులు ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రేపటి నుండి మధ్యాహ్నం 2 గంటల వరకే వ్యాపారాలు నిర్వహించాలని విజయవాడ ఛాంబర్ అఫ్ కామర్స్ అధ్యక్షుడు కొనకళ్ల విద్యాధరరావు తెలిపారు. కరోనా విజృంభణ భయంకరంగా ఉన్న ఈ నేపథ్యంలో షాపులని పూర్తిగా తెరచి ఉంచడం మంచిది కాదు అని విజయవాడ లోని వ్యాపారాలు మధ్యాహ్నం 2 లోపల షాపులు మూసేయాలని కోరారు.