YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం దేశీయం విదేశీయం

ఇండియాలో కొవిడ్ సెకండ్ వేవ్ పట్ల డబ్లుహెచ్ఓ ఆందోళన.. 2600 మంది వైద్య నిపుణుల్ని పంపించేందుకు సిద్దం

ఇండియాలో కొవిడ్ సెకండ్ వేవ్ పట్ల డబ్లుహెచ్ఓ ఆందోళన..  2600 మంది వైద్య నిపుణుల్ని పంపించేందుకు సిద్దం

న్యూ ఢిల్లీ ఏప్రిల్ 27
ఇండియాలో కొవిడ్ సెకండ్ వేవ్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తూనే ఉంది. కేసులు లక్షలాదిగా నమోదవుతూనే ఉన్నాయి. వేలాది మంది ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. ఈ మారణహోమాన్ని ఎలా అదుపులోకి తీసుకురావాలో అర్థంకాక ప్రభుత్వాలు తలపట్టుకుంటున్నాయి. ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా.. కేసుల పెరుగుదల మాత్రం ఆగట్లేదు.ఈ పరిస్థితిపై.. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్లుహెచ్ఓ) కూడా తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది. భారత్ లో కరోనా పరిస్థితులు దారుణంగా ఉన్నాయని వ్యాఖ్యానించింది. ప్రస్తుతం ఇండియాను చూస్తుంటే.. హృదయవిదారకంగా అనిపిస్తోందని డబ్లుహెచ్ఓ  చీఫ్ టెడ్రస్ అథనోమ్ ఆవేదన వ్యక్తంచేశారు.ఈ కండీషన్లోంచి భారత్ ను గట్టెక్కించడానికి తనవంతు సహకారం అందించేందుకు డబ్లుహెచ్ఓ  ముందుకు వచ్చింది. ఇందులో భాగంగా.. 2600 మంది వైద్య నిపుణుల్ని భారత్ కు పంపించేందుకు సిద్ధమైంది. వీరంతా త్వరలోనే ఇండియా చేరుకొని వైద్య సహాయం అందిస్తారని అథనోమ్ ప్రకటించారు.

Related Posts