YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

తెనాలి సబ్ కలెక్టర్ కు సంగం డెయిరీ బాధ్యతలు

తెనాలి సబ్ కలెక్టర్ కు సంగం డెయిరీ బాధ్యతలు

గుంటూరు, ఏప్రిల్ 27, 
గుంటూరు జిల్లా సంగం డెయిరీ విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డెయిరీ యాజమాన్యం బదిలీ చేసింది.గుంటూరు జిల్లా పాల ఉత్పత్తి దారుల సహకార సంఘానికి బదిలీ చేశారు. సంగం డెయిరీ యాజమాన్య హక్కులు మారుస్తూ ఏపీ ప్రభుత్వం జీవో విడుదల చేసంది. సంగం డెయిరీ రోజువారీ కార్యకలపాల బాధ్యత తెనాలి సబ్ కలెక్టర్‌కు అప్పగించారు.. తెనాలి సబ్ కలెక్టర్ మయూర్ అశోక్ డెయిరీకి చేరుకున్నారు.. అక్కడి పరిస్థితులపై ఆరా తీయనున్నారు. డెయిరీ రోజువారీ కార్యకలాపాలు ఇబ్బంది కలగకూడదని ఉద్దేశంతోనే జీవో విడుదల చేశామని ప్రభుత్వం చెబుతోంది.సంగం డెయిరీలో అవకతవకలు జరిగాయంటూ ఏసీబీ అధికారులు ఛైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర కుమార్‌ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆయన్ను కోర్టులో హాజరుపర్చగా రిమాండ్ విధించడంతో జైలుకు తరలించారు. అలాగే ఐదు రోజులుగా సంగం డెయిరీలో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. మరోవైపు ఇప్పటికే డెయిరీ వ్యవహారాలపై మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పైనా విచారణ కొనసాగుతోంది.

Related Posts