YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

కణం రివ్యూ

 కణం రివ్యూ

నటీనటులు: నాగశౌర్య.. సాయిపల్లవి.. విరోనికా అరోరా.. గాంధారి నితిన్‌.. ప్రియదర్శి.. సంతాన భారతి.. రేఖ.. రవి.. స్టంట్‌ సిల్వా తదితరులు 

మ్యూజిక్: శామ్‌ సీఎస్‌ 

ప్రొడ్యూసర్: అలీరాజా సుభాష్‌కరణ్‌ 

డైరెక్షన్: ఏ.ఎల్‌.విజయ్‌ 

హారర్ సినిమాలు తీయడంలో ఒక్కో డైరెక్టర్ ది ఒక్కో స్టైల్. ఒకరు కామెడీతో భయపడితే.., కొందరు ఫుల్ హారర్ ఎలిమెంట్స్ తో భయపెడతారు. కొంతమంది సెంటిమెంట్ ను మిక్స్ చేస్తారు.  రొటీన్ కు భిన్నంగా సినిమాలు తీస్తాడనే పేరున్న డైరెక్టర్ విజయ్ డైరెక్షన్లో వచ్చన సినిమా దియా.. తెలుగులో దీన్ని కణంగా రిలీజ్ చేశారు. యంగ్ హీరో నాగశౌర్య, ఫిదా బ్యూటీ సాయిపల్లవి నటించడంతో సినిమాకు క్రేజ్ వచ్చింది. మరి కణం భయపెట్టిందా..? నాగశౌర్యకు హిట్ ఇచ్చిందా.?

కథేంటంటే: కృష్ణ(నాగశౌర్య), తులసి(సాయిపల్లవి) కాలేజీలో ఉన్నప్పుడే లవ్ చేసుకుంటారు. పెళ్లికి ముందే తొందరపడటంతో తులసి గర్భవతి అవుతిం. చిన్నవయసులో పెళ్లి వద్దన్న పెద్దలు తులసికి అబార్షన్ చేయిస్తారు. ఐదేళ్లపాటు ఇద్దర్నీ కలవకుండా ఉంచుతారు. చదువు పూర్తై ఉద్యోగం వచ్చిన తర్వాత ఇద్దరికీ పెళ్లి చేస్తరు. కానీ ఐదేళ్ల క్రితం అబార్షన్ చేసినప్పుడు చనిపోయిన పాపను తల్చుకుంటూ తులసి బాధపడుతూనే ఉంటుంది. కడుపులో ఉన్నప్పుడే ఆ పాపకు దియా అని పేరు పెడుతుంది. కృష్ణ తన లైఫ్ లోకి రావడంతో తులసిలో మార్పొస్తుంది. కానీ దియా అనే పాప... వాళ్ల మధ్య ఆత్మరూపంలో తిరుగుతుంటుంది. తనను.,  తల్లికి దూరం చేసిన వారిపై ప్రతీకారం తీర్చుకుంటూ ఉంటుంది. తనింటో ఓ పాప ఆత్మ ఉందని.. తనను చంపిన వాళ్లను చంపేస్తుంటుందని తెలుసుకున్న తులసి ఏం చేసింది? తన భర్తను ఎలా కాపాడుకుంది? అనేది మిగిలిన స్టోరీ.

ఎలా ఉంది: ఇది ఆత్మ కథ.. ప్రతీకారం నేపథ్యంలోనే సాగుతుంది.  దీనికి భ్రూణ హత్యలను పాయింట్‌గా తీసుకున్నాడు డైరెక్టర్. కడుపులో ఉన్న పిండానికీ ప్రాణం ఉంటుందని, తల్లిని చూడటానికి తహతహలాడుతుంటుందని అనుకొని దానిపై సినిమా తీయాలన్న డైరెక్టర్ ఆలోచనకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. చిన్నపిల్లల శరీరంలోకి ఆత్మలు వెళ్లిపోవడం, వారితో హత్యలు చేయించడం అనేది కూడా పాతదే. కానీ, ఆ ఆత్మ ఒక పిండానిది కావడం ప్రేక్షకుడిని కదిలిస్తుంది. అమ్మ పిలుపు కోసం ఆ ఆత్మ ఎప్పుడూ పరితపిస్తుంటుంది. ఈ సన్నివేశాలకు భయం, థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌తో పాటు, తల్లి సెంటిమెంట్‌ను కూడా జోడించి ఎమోషనల్‌గా చూపించాడు. ఇంటర్వెల్ అందరినీ కదిలిస్తుంది. ఆ..! అబార్షన్‌ ఏముంది చాలా చిన్న విషయం అనుకున్నవారికి ఈ సినిమా ఒక కనువిప్పు. సాధారణంగా సినిమాల్లో ఆత్మలను, దెయ్యాలను చూడగానే భయం కలుగుతుంది.

సెకండ్ హాఫ్ ప్రారంభంలో స్టోరీ నెమ్మదిస్తుంది. దియా టార్గెట్‌ ఏంటో తెలిసిన తర్వాత స్టోరీ మరింత పరుగులు పెడుతుంది. క్లైమాక్స్‌ అంతుపట్టని విధంగా రాసుకున్నాడు దర్శకుడు. అక్కడ కూడా తల్లీ కూతుళ్ల మధ్య ఉన్న ఎమోషనల్‌ బాండింగ్‌ను హైలైట్‌ చేశాడు. తన భర్తను కాపాడుకునేందుకు భార్య పడే తపన సెకండ్ హాఫ్ లో బాగా చూపించారు. క్లైమాక్స్‌ కొత్తగా.., గుండెలకు హత్తుకునేలా ఉంది.

ఎవరెలా చేశారంటే:  సినిమా మొత్తం మూడు పాత్రల చుట్టూ సాగుతుంది. కృష్ణ, తులసి, దియాల మధ్య సాగే కథ. సాయి పల్లవి తల్లిగా, భార్యగా ఆకట్టుకుంది.   ఇంటర్వెల్ ముందు, క్లైమాక్స్ లో సాయిపల్లవి నటనకు ఫిదా అవ్వాల్సిందే. నాగశౌర్య ఈసారి సీరియస్‌ పాత్రలో ఆకట్టుకున్నాడు. దియాగా నటించిన పాప విరోనికా నటన మెప్పిస్తుంది. ప్రియదర్శి ఎస్సైగా కనిపిస్తాడు. మొదట్లో తన పాత్రని కాస్త కామెడీ చేశారు. చివర్లో సీరియస్‌నెస్‌ తీసుకొచ్చారు.

టెక్నికల్ గా సినిమా బాగుంది. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్  స్కోరీ సూపర్ గా ఉంది. భ్రూణ హత్యల నేపథ్యంలో ఒక కథను ఇలా కూడా చెప్పొచ్చా..? అనిపిస్తుంది. దర్శకుడి ఆలోచనకు, అతను తీసిన విధానానికి హ్యాట్సాఫ్‌ చెప్పాల్సిందే.

ప్లస్ పాయింట్స్

+ నాగశౌర్య, సాయిపల్లవి, దియాల నటన 

+ టెక్నికల్ స్టాండర్డ్స్ 

+ క్లైమాక్స్‌

మైనస్ పాయింట్స్

- రెగ్యులర్‌ ప్రేక్షకులకు నచ్చకపోవచ్చు 

Related Posts