YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

షర్మిలతో కాంగ్రెస్ కే ముప్పా

షర్మిలతో కాంగ్రెస్ కే ముప్పా

హైదరాబాద్, ఏప్రిల్ 28, 
వుడు చేసిన మనుషులే అందరూ. కానీ రాజకీయాల్లో నేతలకు చాలా మందికి మాత్రం దిక్కూ దాతా దైవం కాంగ్రెస్ పార్టీనే. ఆ పార్టీ నుంచే ఎంతో మంది నేతలు వచ్చారు. ఇంకా వస్తున్నారు. అందుకే కాంగ్రెస్ బ్రాండ్ అలా ఇప్పటికీ వెలుగుతూనే ఉంది. ఇదే మాటను కాంగ్రెస్ లో పాత తరం నేత వి హనుమంతరావు అంటున్నారు. ఇపుడున్న నేతలంతా కాంగ్రెస్ తయారు చేసిన వారేనని ఎన్నో సార్లు వీహెచ్ అన్నారు ఇపుడు తాజాగా ఆయన వైఎస్ షర్మిల మీద సెటైర్లు వేస్తూ మీ నాయన వైఎస్సార్, మీ అన్న జగన్ కాంగ్రెస్ ప్రోడక్ట్ కాదా అంటూ గట్టిగానే నిలదీశారు.ఆ మాటకు వస్తే ఏపీలో చంద్రబాబు, ప్రస్తుతం తెలంగాణాను ఏలుతున్న కేసీయార్ వంటి వారు కూడా కాంగ్రెస్ నుంచి వచ్చినవారే. ఇంకా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది నేతలు కాంగ్రెస్ వాసనతో ఉన్నవారే. కానీ ఇపుడు వీహెచ్ చూపు మాత్రం వైఎస్సార్ ఫ్యామిలీ మీద ఉంది. వారినే ఆయన గట్టిగా టార్గెట్ చేస్తున్నారు. నాడు వైఎస్సార్ దివంగతులు అయ్యాక జగన్ మీద పెద్ద ఎత్తున రాజకీయ బాణాలు వేసిన వారిలో వీహెచ్ ముందు వరసలో ఉన్నారు. కేంద్ర నాయకత్వంతో జగన్ కి చెడిపోవడానికి కూడా వీహెచ్ లాంటి వారే కారణం అని అంటారు.వైఎస్ షర్మిల పార్టీ పెట్టారు. టీయారెస్ నే ఆమె లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నారు. కానీ టీయారెస్ పెద్ద నాయకుల నుంచి ఏ విధంగానూ స్పందన లేదు అదే సమయంలో బీజేపీ, కాంగ్రెస్ మాత్రం షర్మిల మీద విమర్శలు చేస్తున్నాయి. అందులో కాంగ్రెస్ మరీ ఎక్కువగా రియాక్ట్ అవుతోంది. ఈ విషయంలో వీహెచ్ లాంటి వారు ఎక్కడా తగ్గడంలేదు. ఎందుకు పార్టీ ఇక్కడ పెట్టావ్ అంటూ ఆయన మొదటి నుంచే ప్రశ్నిస్తున్నారు. మీ అన్నతో గొడవ వస్తే అక్కడే తేల్చుకోవాలి తప్ప తెలంగాణాలో పార్టీ ఏంటి అని గయ్యిమంటున్నారు. అంతే కాదు తెలంగాణా బిడ్డను అంటున్నావ్, ఉద్యమ కాలంలో నీవు ఎక్కడ ఉన్నావ్ అని కూడా షర్మిలను నిలదీస్తున్నారు.వైఎస్ షర్మిల పార్టీ నుంచి తొలి ముప్పు ఉన్నది మాత్రం కచ్చితంగా కాంగ్రెస్ కే అన్న విశ్లేషణలు ఉన్నాయి. ఆమె వైఎస్సార్ కుమార్తె. తండ్రి ఆ పార్టీకి దశాబ్దాల పాటు సేవలు చేశారు. ఏపీలో కాంగ్రెస్ బలాన్ని అంతా జగన్ తీసుకుపోయాడు. ఇపుడు తెలంగాణాలో జనాకర్షణ లేక కాంగ్రెస్ విలవిలలాడుతోంది. దాంతో షర్మిల వంటి పొలిటికల్ గ్లామర్ ఉన్న నేత, వైఎస్సార్ బ్రాండ్ ఇమేజ్ తో వస్తే కచ్చితంగా కాంగ్రెస్ లో పెద్దఎత్తున కదలికలు ఉంటాయని అంచనా కడుతున్నారు. దాంతోనే ఇపుడు షర్మిలను కాంగ్రెస్ నేతలు టార్గెట్ చేస్తున్నారు అంటున్నారు. అందరి కంటే ముందు వీహెచ్ ఈ పనిలో పడ్డారు. ఆమె కాంగ్రెస్ నేతలకు ఫోన్లు చేసి మరీ పార్టీలోకి ఆహ్వానిస్తోందని కూడా మండిపడుతున్నారు. ఏది ఏమైనా జగన్ వల్ల కాంగ్రెస్ కి నష్టమని నాడు బాగా ఊహించిన వీహెచ్ ఇపుడు షర్మిల విషయంలో వేస్తున్న అంచనాలు కూడా నిజం అయ్యేట్లుగా ఉన్నాయన్న మాట మాత్రం వినిపిస్తోంది.

Related Posts