కోదాడ
తన వదినతో అక్రమ సంబంధం పెట్టుకొని అడ్డుగా ఉన్న తన అన్నను చంపిన ఒక వ్యక్తిని చంపేందుకు వెళ్లి విఫలం అయ్యి పోలీసులకు దొరికిపోయాడు ఒక వ్యక్తి. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం నల్లబండగూడెం గ్రామానికి చెందిన గూగులోతు సురేష్ గత సంవత్సరంలో.. సిరిసిల్ల జిల్లా రామోజీపేట గ్రామానికి చెందిన బస్వరాజు తిరపతయ్య భార్య మమత తో అక్రమ సంబంధం పెట్టుకొని తిరపతయ్య ను హత్య చేసి జైలుకు వెళ్ళొచ్చాడు సురేష్. తిరుపతయ్య తమ్ముడు జనార్దన్ తన అన్నను చంపిన గూగులోతు సురేష్ పై కక్ష్య పెంచుకున్నాడు. సురేష్ ను చంపేందుకు రెండున్నర లక్షలకు సుపారి కూడా ఇచ్చాడు జనార్దన్. సురేష్ ని హత్య చేసేందుకు కోదాడ మండలం నల్లబండగూడెం గ్రామానికి వేటకొడవళ్లతో అర్ధరాత్రి వచ్చిన సుపారి గ్యాంగ్, సురేష్ లేకకపోవడంతో సురేష్ తల్లి గూగులోతు రాంబాయి ని బెదిరించారు. ప్రాణభయంతో గూగులోతు రాంబాయి కోదాడ రూరల్ పోలీసులను ఆశ్రయించి పిర్యాదు ఇచ్చింది. దాంతో పోలీసులు రామాపురం క్రాస్ రోడ్డు లో వేటకొడవళ్ల తో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులను విచారించ అసలు నిజం బయటపడింది. సుపారి గ్యాంగ్ ను, వారికి సుపారి ఇచ్చిన జనార్దన్ ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.