YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

8 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో న‌మోదు కాని క‌రోనా మ‌ర‌ణాలు

8 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో న‌మోదు కాని క‌రోనా మ‌ర‌ణాలు

న్యూఢిల్లీ ఏప్రల్ 28
క‌రోనా మ‌హమ్మారి దేశాన్ని గ‌జ‌గ‌జ వ‌ణికిస్తోంది. మ‌హారాష్ట్ర, కేర‌ళ‌, క‌ర్ణాట‌క‌, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, త‌మిళ‌నాడు రాష్ట్రాల్లో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య గ‌ణ‌నీయంగా పెరిగిపోతోంది. ఈ రాష్ర్టాల్లో క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య కూడా భారీగానే ఉంది. కానీ కొన్నిరాష్ట్రాలు,కేంద్ర పాలిత ప్రాంతాల్లో క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు అవుతున్న‌ప్ప‌టికీ, మ‌ర‌ణాల సంఖ్య మాత్రం మంగ‌ళ‌వారం న‌మోదు కాలేదు. దీంతో ఆ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఊపిరి పీల్చుకున్నాయి. త్రిపుర‌, మిజోరం, నాగాలాండ్‌, అరుణాచ‌ల్‌ప్ర‌దేశ్‌, దాద్రా న‌గ‌ర్ హావేలి, ల‌డ‌ఖ్‌, ల‌క్ష‌ద్వీప్, అండ‌మాన్ నికోబార్ దీవుల్లో క‌రోనా మ‌ర‌ణాలు మంగ‌ళ‌వారం న‌మోదు కాలేదు. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 3,60,960 పాజిటివ్‌ కేసులు నమోదవగా, 3293 మంది మరణించారు. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1,79,97,267కు చేరగా, కరోనా మరణాలు 2,01,187 వద్ద నిలిచాయి. కొత్తగా 2,61,162 మంది కోలుకోవడంతో మొత్తం 1,48,17,371 మంది బాధితులు డిశ్చార్జీ అయ్యారు. మరో 29,78,709 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 14,78,27,367 మందికి కరోనా టీకా పంపిణీ చేశారు.మ‌హారాష్ర్ట‌, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, ఢిల్లీ, క‌ర్ణాట‌క‌, కేర‌ళ‌, చ‌త్తీస్‌గ‌ఢ్‌, ప‌శ్చిమ బెంగాల్‌, త‌మిళ‌నాడు, గుజ‌రాత్‌, రాజ‌స్థాన్ రాష్ర్టాల్లో కొత్త 71.68 శాతం కేసులు న‌మోదు అయ్యాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో మ‌హారాష్ర్ట‌లో క‌రోనాతో 895 మంది మ‌ర‌ణించారు. కొత్త‌గా 66,358 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. పంజాబ్‌లో 5,932 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, 100 మంది ప్రాణాలు కోల్పోయారు. క‌ర్ణాట‌క‌లో 31,830 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, 180 మంది మ‌ర‌ణించారు. గుజ‌రాత్‌లో 14,352 పాజిటివ్ కేసులు, 170 మంది మృతి చెందారు.

Related Posts