అమరావతి
బతికుంటేనే రాజకీయాలైనా. కుట్రలు, కుతంత్రాలు, విధ్వంసాలు ఆపి కరోనా నియంత్రణపై దృష్టి పెట్టాలి. శ్మశానాలలో శవాలు గుట్టలు, గుట్టలుగా తగులబడుతుంటే బాధేస్తోందని మాజీ ముఖ్యమంత్రి, శాసనసభ ప్రధాన ప్రతిపక్ష నేత, నారా చంద్రబాబు నాయుడు అన్నారు. బుధవారం అయన మీడియాతో మాట్లాడారు. కరోనా విపత్కర పరిస్తితులలో ప్రభుత్వ ఫుల్ పేజీ అడ్వటైజ్ మెంట్లా? ప్రజలు బతికి లేనప్పుడు మీ పథకాలు ఎవరి కోసం? ఈ రోజు మనందరం సంక్షోభంలో ఉన్నాం. కరోనా ప్రపంచాన్ని గడగడలాడించినా కొన్ని దేశాలు సమర్ధవంతంగా ముందుకెళ్లి పాజిటివ్ ఫలితాలు కూడా సాధించారు. ఇప్పుడు రెండవ వేవ్ మొదటి వేవ్ కంటే చాలా ఉధృంతంగా ఉంది. మొదటి వేవ్ లో నేర్చుకున్న గుణపాఠాలను బేరీజు వేసుకుని రెండవ వేవ్ లో చర్యలు తీసుకోవడంలో మనం విఫలమయ్యామని అన్నారు. రెండవ వేవ్ ను రాజకీయాలకు అతీతంగా ఎదుర్కోవాలి. డబ్బులు కంటే ప్రాణం చాలా ముఖ్యమైంది. ఎవరు ఉంటారో, ఎవరు చనిపోతారో తెలియని పరిస్థితి. ప్రభుత్వాలు చాలా భాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఈ రోజు రాష్ట్రంలో శ్మశానాలను చూస్తే శవాలతో నిండిపోయాయి. ప్రభుత్వం చెప్పే లెక్కలకు అక్కడ జరుగుతున్న సంఘటనలకు పొంతనే లేదు. ఈ రోజు ప్రపంచం మొత్తం ఇండియా గురించి, మన రాష్ట్రం గురించి మాట్లాడుతుంటే చాలా బాధేస్తుంది. దేశంలో 3 లక్షల 60 వేల కేసులు వస్తున్నాయి. టెస్టులు కూడా తగ్గించాం కాబట్టి నంబర్ తగ్గుతుంది. శవాలను గదిలో పెట్టి తలుపు మూసినంత మాత్రనా అది వాసన రాకుండా మానదు. బయట ప్రపంచానికి తెలియకుండా పోదు. దాదాపు రాష్ట్రంలో రోజుకు 10 లక్షల 54 కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటి వరకు ప్రభుత్వ లెక్కల ప్రకారం 7800 మంది చనిపోయారు. ఇంతమంది చనిపోయిన తర్వాత ప్రభుత్వం మాట్లాడుతూ ఎవరైనా తప్పుడు సమాచారం ప్రచారం చేస్తే కేసులు పెడుతామని ఫ్యానిక్ రియాక్షన్ క్రియేట్ చేస్తుంది. ప్రభుత్వం వాస్తవాలను దృష్టిలో పెట్టుకుని మాట్లాడాల్సిన అవసరం ఉంది. ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన ప్రభుత్వం మీనవేషాలు లెక్కిస్తూ తమ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి ఎదురుదాడి చేయడం దుర్మార్గం. ఇది ఒక నేరమనిఅయన అన్నారు.
ప్రభుత్వం చేతగానితనానికి ప్రజల ప్రాణాలను బలిగొంటూ వారు తమ బాధను కూడా చెప్పుకొనే స్వేచ్చ కూడా లేకుండా చేయడం చాలా అన్యాయం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. హెచ్చరిస్తున్నా. రాష్ట్రంలో పాజిటివిటీ రేట్ 25.8 శాతం. దీనికి సమాధానం చెప్పే పరిస్థితిలో ప్రభుత్వం ఉందా? 10 లక్షల మందికి 13,485 మందికి పాజిటివ్ రిజల్ట్స్ వస్తే మన రాష్ట్రంలో 10 లక్షల మందికి 20,200 మంది పాజిటివ్ రిజల్ట్స్ వచ్చాయి. మన ప్రక్కనున్న తమిళనాడు రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ నుంచి వచ్చే వాళ్లు ఈ-పాస్ తీసుకుని రావాలని నిబంధన పెట్టారు. ఒరిస్సా - ఆంధ్ర ప్రదేశ్ సరిహద్దులన్నీ మూసివేసి తెలుగువారిని ఎవరిని వాళ్ల రాష్ట్రంలోకి అనుమతించడం లేదు. మన దేశం నుండి ఇతర దేశాలకు వెళ్లెందుకు అనేక ఆంక్షలు విధించారు. అన్ని చర్యలు తీసుకుంటున్నామని బుకాయించడం కోసం జీవోలు జారీ చేశారు. ఆరోగ్యశ్రీ కింద కోవిడ్ ను ట్రీట్ చేస్తామని చెబుతున్నారు. కానీ ఇంత వరకు ఎవ్వరికీ ఇవ్వలేదని అన్నారు. గవర్నమెంట్ ఆప్ ఇండియా మన రాష్ట్రానికి ఇచ్చిన వ్యాక్సిన్ లో 10 శాతం వృధా చేశారు. కరోనా సమయంలో లిక్కర్ షాపులు ఓపెన్ చేసి టీచర్లకు అక్కడ విధులు వేసే పరిస్థితికి ఈ ప్రభుత్వం వచ్చిందంటే ఏమనాలి? బార్లు, రెస్టారెంట్లు, థియేటర్లు, పబ్లిక్ మార్కెట్లు, ఆర్.టి.సి ఓపెన్ చేసి కరోనా లేనట్టు ఈ ప్రభుత్వం ప్రవర్తిస్తుంది. మాస్కులు కూడా వేసుకోకుండా రాష్ట్రంలో ఇంత ఉదృతి రావడానికి రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని అన్నారు.