YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

సంగం సాక్ష్యాలందిచ్చినందుకు కీలక పదవి

సంగం సాక్ష్యాలందిచ్చినందుకు కీలక పదవి

గుంటూరు, ఏప్రిల్ 29, 
సంగం డెయిరీ లో అవకతవకలున్నాయని, అందులో లోగుట్టును అంతా బయటపెట్టింది ఎవరో తెలుసా? అక్కడ వైసీపీ నేత రావి వెంకట రమణ. ఆయన ధూళిపాళ్ల నరేంద్ర పై అనేక ఏళ్లుగా పోరాటం చేస్తూనే ఉన్నారు. కానీ అక్కడ జరిగే అవకతవకలను ఎవరి దృష్టికి తీసుకెళ్లినా పెద్దగా ఫలితం కన్పించలేదు. దీంతో రావి వెంకటరమణ సంగం డెయిరీకి సంబంధించి పకడ్బందీగా ఆధారాలను సేకరించి జగన్ ముందుంచారంటున్నారు. దీనివల్లనే ధూళిపాళ్ల నరేంద్రను అరెస్ట్ చేయగలిగారంటున్నారు. రావి వెంకటరమణ వైసీపీలో నమ్మకమైన నేత. గత ఎన్నికల్లోనే రావి వెంకటరమణ పొన్నూరు నియోజకవర్గం నుంచి పోటీ చేయాల్సి ఉంది. అయితే కొన్ని ఈక్వేషన్ల కారణంగా జగన్ కిలారు రోశయ్యకు టిక్కెట్ ఇచ్చారు. తనను కాదని కిలారు రోశయ్యకు టిక్కెట్ ఇచ్చినా రావి వెంకటరమణ చిత్తశుద్ధితో ఆయన గెలుపుకోసం పనిచేశారు. ధూళిపాళ్ల నరేంద్ర ను ఓడించడమే థ్యేయంగా పెట్టుకుని విజయం సాధించారు. రావి వెంకటరమణ సీనియర్ నేత 2004లోనే ఆయన ప్రత్తిపాడు నుంచి పోటీ చేసి మాకినేని పెద్దరత్తయ్యను ఓడించారు. అలాంటి వెంకటరమణ వైసీపీ అధికారంలోకి వచ్చినా ధూళిపాళ్ల నరేంద్ర సంగం డెయిరీలో అక్రమాలను కొనసాగిస్తున్నారని భావించి గత కొద్ది నెలలుగా దీనిపై నిఘా వేశారంటున్నారు. నేరుగా జగన్ తోనే డెయిరీ వ్యవహారం మాట్లాడేందుకు వీలుకలిగింది. దీంతో రావి వెంకటరమణ పూర్తి స్థాయి ఆధారాలు సేకరించి జగన్ ముందుంచడతో ఏసీబీ అధికారులు ధూళిపాళ్ల నరేంద్రను అరెస్ట్ చేశారు. జగన్ కూడా రావి వెంకటరమణను ప్రశంసించినట్లు చెబుతున్నారు.ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యేగా కిలారు రోశయ్య ఉన్నప్పటికీ ఆయన నిన్నటి వరకూ ధూళిపాళ్ల నరేంద్ర పై నోరు మెదపలేదు. ఇద్దరూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోకూడదన్న ఒప్పందం ఉన్నట్లుంది. ఇది గమనించిన జగన్ రావి వెంకటరమణకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చి గో ఎహెడ్ అని చెప్పడంతో ఆయన సక్సెస్ ఫుల్ గా టాస్క్ ను పూర్తి చేశారంటున్నారు. 1200 కోట్ల టర్నోవర్ ఉన్న సంగం డెయిరీలో జరుగుతున్న అక్రమాలను సాక్షాధారాలతో సమర్పించడంతో జగన్ త్వరలోనే రావి వెంకటరమణ కు కీలక పదవి ఇవ్వబోతున్నట్లు వైసీపీలో ప్రచారం జరుగుతోంది.

Related Posts