ఖమ్మం, ఏప్రిల్ 29,
ఎండలు మండిపోతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి.. ఉష్ణతాపానికి ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. భద్రాద్రి జిల్లాలోని బొగ్గు బావులు భగ్గుమంటున్నాయి. దీంతో కార్మికులు గనుల్లో దిగడానికి జంకాల్సిన పరిస్థితి నెలకొన్నది. ఈ నెల మొదటి వారంలో ఎండలు దంచికొట్టినప్పటికీ రెండో వారంలో కాస్త ఎండ తీవ్రత తగ్గింది. మళ్లీ ఎండల తీవ్రత పెరిగే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో సింగరేణి యాజమాన్యం కార్మికుల కోసం ఉపశమన చర్యలు తీసుకుంటున్నది.వేసవి వచ్చేసింది.. పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి.. ఎండలు మండుతున్నాయి.. భద్రాద్రి జిల్లాలోని బొగ్గు బావులు భగ్గుమంటున్నాయి. దీంతో కార్మికులు గనుల్లో దిగడానికి జంకాల్సిన పరిస్థితి నెలకొన్నది. ఈ నెల మొదటి వారంలో ఎండలు దంచికొట్టినప్పటికీ రెండో వారంలో కాస్త ఎండ తీవ్రత తగ్గింది. మళ్లీ ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో సింగరేణి యాజమాన్యం కార్మికుల కోసం ఉపశమన చర్యలు తీసుకుంటున్నది. ఇల్లెందు ఏరియాలో కార్మికులు షిఫ్టుల వారీగా పనిచేస్తున్నారు. మొదటి షిఫ్ట్ ఉదయం 7:30 గంటల నుంచి మధ్యా హ్నం 3:30 గంటల వరకు, రెండో షిఫ్ట్ మధ్యాహ్నం 3:30 గంటల నుంచి 11:30 గంటల వరకు, మూడో షిఫ్ట్ రాత్రి 11:30 గంటల నుంచి ఉదయం 7:30 గంటల వరకు కొనసాగుతున్నది. ముఖ్యంగా మొదటి షిఫ్ట్ నుంచి ఇంటికొచ్చే కార్మికులు రెండో షిప్టునకు గనికి వెళ్లే కార్మికులు ఎండతీవ్రతకు గురవుతున్నారు.ఏటా వేసవిలో బొగ్గు గని ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. మిగిలిన ప్రాంతాల్లో కన్నా ఇక్కడ ప్రభావం ఉంటుంది. బొగ్గుకు వేడిని గ్రహించే గుణం ఉండడం, తిరిగి అదే వేడిని బయటకు విడుదల చేసే గుణం ఉండడంతో సహజం గానే ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతాయి. భూగర్భ గనుల్లో ఏకాలంలోనైనా ఉష్ణోగ్రతలు నిలకడగా ఉంటున్నప్పటికీ ఉపరితల గనుల్లో మాత్రం తట్టుకోలేని విధంగా ఉంటాయి. భూగర్భ గనుల్లో పనిచేసే కార్మికులు కేవలం ఇంటికి వెళ్లేటప్పుడు, ఇంటి నుంచి విధులకు వచ్చేటప్పుడు మాత్రమే ఎండతీవ్రతను ఎదుర్కొంటారు. ఉపరితల గని కార్మికులు మాత్రం వేసవి తాపానికి అల్లాడుతుంటారు.గనులు, డిపార్ట్‌మెంట్లలో పనిచేసే కార్మికులు, అధికారులు ఎండతీవ్రతకు ఇబ్బందులు పడుతున్నారు. ఉపరితల గనుల్లో పని చేసే చోట శీతలీకరణ యంత్రాలు ఉన్నప్పటికీ ఆరుబయట పనిచేసే సిబ్బంది, పర్యవేక్షణకు వచ్చే అధికారులు ఎండతీవ్రతకు ఇబ్బందులు పడుతున్నారు. సింగరేణి యాజమాన్యం వేసవి నేపథ్యంలో రెస్టింగ్ షెల్టర్లను నిర్మిస్తున్నది. అవసరమైన చోట చల్లదనం కోసం కూలర్లు ఏర్పాటు చేస్తున్నది. కాగా రెస్టింగ్ షెల్టర్లలో ఏసీలు ఏర్పాటు చేయాలని కార్మికులు కోరుతుండగా అందుకు యాజమాన్యం సుముఖంగా ఉన్నట్లు తెలుస్తున్నది. మరోవైపు కార్మికులకు మజ్జిగ పంపిణీ చేస్తున్నది. పని ప్రదేశాల్లో ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచుతున్నది.