YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

బ్రాండ్ దోపిడీ..!!

 బ్రాండ్ దోపిడీ..!!

రంగు సంచులతో బురిడీ కొడుతున్నారు.. కాదు.. కాదు దర్జాగా దందా చేస్తూ జనాలను పిండుతున్నారు. వివిధ జిల్లాలు, బ్రాండ్ల పేరుతో రంగు సంచుల్లో బియ్యాన్ని నింపడం.. అనుచర దుకాణాలకు సరఫరా చేయడం వీలైనంత మేర దండుకోవడం రివాజుగా సాగుతోంది. వేల క్వింటాళ్ల సన్నబియ్యం విక్రయాలు సాగుతుండగా నిలువరించాల్సిన యంత్రాంగమే లేకపోవడం విడ్డూరం. ఇక జేబులు గుల్ల చేసుకోవడం వినియోగదారుని వంతవుతోంది. అధికారుల సమాచారం ప్రకారం ఉమ్మడి జిల్లాలో హోలోగ్రామ్‌ ఉన్న బియ్యం బ్రాండ్‌ ఒక్కటీ లేదు. మార్కెట్‌లో మాత్రం వివిధ రకాల పేర్లతో కొన్ని వందల బ్రాండ్లు పుట్టుకొస్తున్నాయి. రిజిస్ట్రేషన్‌, హోలోగ్రామ్‌ లేని వారు రకరకాల పేర్లతో సంచులు తయారు చేసుకుని బియ్యాన్ని అధిక ధరకు వినియోగదారులకు అంటగడుతున్నారు. కరీంనగరంలో రెండేళ్ల కిందట 300 వరకు రైస్‌ డిపోలుండేవి. కాలక్రమేణా వెయ్యి వరకు వెలిశాయి. తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయం గడించే వ్యాపారం కావడంతో పలువురు వ్యాపారులు, మిల్లర్లు కలిసి దందాకు తెరలేపారు.

జిల్లాలో మిల్లర్లు ఆడిందే ఆటగా మారింది.. ప్రభుత్వ నిబంధనల ప్రకారం సూపర్‌ ఫైన్‌ క్వాలిటీ ఉండే బియ్యాన్ని కిలో రూ.30 మించి బహిరంగ మార్కెట్లో విక్రయించకూడదు. ఇది మచ్చుకైనా అమలు కావడం లేదు. రకరకాల పేర్లు పెట్టుకుని ఎవరి ఇష్టమొచ్చినట్లు వారు ధరలు నిర్ణయించుకుని అమ్మకాలు చేస్తున్నారు. ఓ పేరు మోసిన బ్రాండ్‌ కిలో బియ్యాన్ని రూ.60లకు అమ్ముతుంటే ఎటువంటి గుర్తింపు, అనుమతులు లేని మరికొంతమంది బ్రాండ్‌ అమ్మకందారులు కిలో బియ్యం రూ.55తక్కువ కాకుండా విక్రయిస్తున్నారు. 25కిలోల బియ్యం రూ.1300 నుంచి రూ.1500 వరకు పలుకుతోంది. పంట పండించే రైతు నుంచి 75 కిలోల ధాన్యం బస్తాను రూ.900లకు మించి కొనుగోలు చేయని వ్యాపారులు వారు తయారు చేసే బియ్యం విషయంలో మాత్రం ఇష్టారాజ్యంగా ధరలు నిర్ణయిస్తూ దోపిడీకి పాల్పడుతున్నారు.

గింజ పరిమాణం ఎలా కావాలంటే అలా తయారు చేసే ఆధునిక యంత్రాలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. రూ.కోటి నుంచి రెండున్నర కోట్ల విలువ చేసే సార్టెక్స్‌ యంత్రాలను కొనుగోలు చేస్తున్న వ్యాపారులు బియ్యం విక్రయాల్లో అనేక రకాల మోసాలకు పాల్పడుతున్నారు. ముడిబియ్యాన్ని ఎలా కావాలంటే అలా మలచుకునే వెసులుబాటు వీటికుంది. పౌరసరఫరాల శాఖ, విజిలెన్స్‌ అధికారులు వీరి అక్రమాలపై దృష్టిసారించకపోవడంతో బియ్యం మాఫియా ఆగడాలు జిల్లాలో శృతిమించిపోతున్నాయి. వాణిజ్య పన్నుల శాఖ ఏనాడు తనిఖీలు నిర్వహించిన దాఖలాలే లేవు. ఇక తూకంలో మోసాలకు పాల్పడుతున్నారు. 25 కిలోల బస్తా 24కిలోల లోపే ఉంటుండగా తూనిఖలు కొలతల శాఖ చర్యలు మాత్రం శూన్యం.

చేసుకుని కొనుగోలు చేసిన ధాన్యాన్ని మరాడించి వీటిలో నింపుతున్నారు. రేషన్‌ బియ్యాన్ని పలుమార్లు పాలిషింగ్‌ చేసి సన్నబియ్యంగా నమ్మిస్తున్నారు. ఇటీవల కాలంలో రేషన్‌ బియ్యం పక్కదారి పట్టకుండా పౌరసరఫరాల శాఖ రాష్ట్ర విభాగం కఠినంగా వ్యవహరిస్తుండటంతో పలువురు ఈ దందాకు తెరలేపారు. రైస్‌డిపోలతో బేరం కుదుర్చుకుని సదరు బియ్యాన్ని బ్రాండ్ల రూపంలో విపణికి వదులుతున్నారు. ఇదిలా ఉంటే భువనగిరి, మిర్యాలగూడ నుంచి బియ్యం దిగుమతి చేసుకునే వ్యాపారులు ప్రభుత్వానికి శఠగోపం పెడుతున్నారు. రాత్రిళ్లు î ేబిల్లులేని వాహనాలతో బియ్యం రవాణా చేస్తున్నారు.

జిల్లాలో 2.70 లక్షల ఆహారభద్రత కార్డుదారుల కోసం ప్రతినెలా ప్రభుత్వం వేల మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని కేటాయిస్తోంది. ఇందులో సుమారు 10వేల క్వింటాళ్లకు పైగా బియ్యం డీలర్ల నుంచి నేరుగా రైస్‌మిల్లులకు చేరుతున్నాయి. గతంలో మిల్లర్లే డీలర్ల నుంచి కిలో రూ.10 చెల్లిస్తే డీలర్‌కు చేరకుండానే మండలస్థాయి నిల్వ కేంద్రాల నుంచి కిలో రూ.15కు కొనుగోలు చేసేదీ. ప్రస్తుతం అడ్డుకట్ట పడటంతో పలువురి బ్రోకర్ల ద్వారా కార్డుదారుల నుంచి డీలర్ల నుంచి బియ్యాన్ని సేకరించి మిల్లులకు తరలిస్తున్నారు. ఇలా వెళ్తున్న వాటిని పునఃప్రక్రియ చేసి చేసి బ్రాండ్ల పేరుతో బహిరంగ మార్కెట్‌లోకి వదులుతున్నారు. పైగా 25 కిలోలు ఉండాల్సిన సంచి 23 నుంచి 24 కిలోలు మాత్రమే ఉంటోంది.

Related Posts