YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

సగం మందికే సాయం

సగం మందికే  సాయం

కరీంనగర్, ఏప్రిల్ 28, 
ప్రైవేటు స్కూల్ టీచర్లకు, సిబ్బందికి సాయం అందలేదు అనే ఆరోపణలు వస్తున్నాయి. కరోనా కారణంగా నష్టపోతున్న టీచర్లకు రాష్ట్ర ప్రభుత్వం సహాయం చేస్తామని చెప్పింది. రెండు వేల రూపాయలు, 25 కిలోల బియ్యం ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. ఇప్పటి వరకు కూడా అవి చాలా మందికి అందలేదు. డీఈఓ కార్యాలయాల చుట్టూ ప్రైవేట్ టీచర్ లు తిరుగుతూనే ఉన్నారు.1.45 లక్షల మందికి సహాయం అందిస్తామని సర్కార్ చెప్పింది. తెలంగాణలో మొత్తం ప్రైవేట్ స్కూళ్లలో టీచర్లు, సిబ్బంది సుమారు మూడు లక్షలు మంది ఉన్నారు. 1.24 లక్షల మందిని విద్యాశాఖ గుర్తించింది. ఇప్పటివరకు 99 వేల మందికి సాయం అందింది. ఇంకా 60 శాతం మందికి సాయం అందలేదు అని లెక్కలు చెప్తున్నాయి. ఒక పక్కన జీతం రాక ప్రభుత్వ సాయం అందక ఉపాధ్యాలు ఇబ్బందులు పడుతున్నారు.
కరీంనగర్ లో
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలోని అడ్డకుంటపల్లిలోని ఓ ప్రయివేటు స్కూల్లో 140 మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. పాఠశాల యాజమాన్యం మాత్రం కేవలం 120 మంది సిబ్బంది వివరాల జాబితానే పంపించింది. మిగితా 20 మందికి ఆర్థిక సాయం అందకుండా పోయింది. ఈ ఒక్క పాఠశాలనే కాదు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రయివేటు పాఠశాలల్లో పని చేసే ఉపాధ్యాయులు, సిబ్బంది పరిస్థితి ఇదేవిధంగా ఉంది.కరోనా వ్యాప్తి వల్ల ఉపాధి కోల్పోయి ఇబ్బందుల్లో ఉన్న ప్రయివేటు టీచర్లను ఆదుకునేందుకు ప్రభుత్వం అందించే ఆర్థిక సాయం ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో కొందరికే అందుతోంది. అర్హత కలిగి ఉండి ప్రయివేటు పాఠశాలల యాజమాన్యాల నిర్లక్ష్యం, విద్యాధికారుల ఆలసత్వం వల్ల జిల్లాలో మరో సగం మంది టీచర్లు ఆర్థిక సాయానికి దూరమయ్యారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా వ్యాప్తంగా కేవలం 9,510 మంది టీచర్లను మాత్రమే ఆర్హులుగా గుర్తించగా యూ డైస్‌ నిబంధనల పేరుతో సుమారు 7వేల మందికిపైగా టీచర్లను ఎంపిక చేయకుండా వదిలేశారు.కరోనాతో ఉపాధి కోల్పోయిన ప్రయివేటు టీచర్లకు ప్రభుత్వం ఆర్థిక సాయం కింద రూ.2వేలు, 25 కిలోల సన్న బియ్యం చొప్పున ఈనెల 21 నుంచి అందిస్తున్నది. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని ప్రయివేటు పాఠశాలల్లో పని చేసే ఉపాధ్యాయులు, సిబ్బందికి ప్రభుత్వం అందించే ఆపత్కాలపు సాయం కోసం విద్యాశాఖ అధికారులు ఆర్హుల జాబితాలను తయారు చేసి ప్రభుత్వానికి పంపించారు. అధికారులు పంపిన నివేదికల ఆధారంగా సాయం అందుతోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నెలకు మొత్తం రూ.1.30 కోట్లను ప్రయివేటు టీచర్లకు ప్రభుత్వం సాయం అందిస్తోంది. పాఠశాల యూ డైస్‌ లెక్కల ప్రకారం.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న 945 ప్రయివేటు పాఠశాలల్లో 17,228 మంది ప్రయివేటు టీచర్లు, బోధనేతర సిబ్బంది ఉన్నారు. వీరిలో 8,641 మంది టీచర్లు, 869 మంది సిబ్బంది.. మొత్తం 9510 మందిని అర్హులుగా ఎంపిక చేశారు. సుమారు 7,718మంది టీచర్లు, సిబ్బందిని అనర్హులుగా గుర్తించి వారికి సాయం అందజేయడం లేదు.చేసుకున్న ప్రతి టీచర్‌కూ సాయం అందించాలిప్రభుత్వం ఇచ్చిన ప్రోఫార్మాలో దరఖాస్తు చేసుకున్న ఆర్హత కలిగిన ప్రతి ప్రయివేటు టీచర్‌కు ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సాయం రూ.2వేలు, 25 కిలోల బియ్యం ఇవ్వాలి. యూడైస్‌ లెక్కల ప్రకారం గుర్తిస్తే కనుక 2019-20 కంటే ముందు నుంచి పనిచేసిన వారిని కూడా గుర్తించాలి. ప్రతి పాఠశాలలో పని చేసే సిబ్బందికి ఆర్థిక సాయం అందించాలి.

Related Posts