YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

మరణాలపై వ్యాపారం

మరణాలపై వ్యాపారం

హైదరాబాద్, ఏప్రిల్ 29,
జీహెచ్‌ఎంసీ పరిధిలో పాజిటివ్‌ కేసులతోపాటు మరణాలూ భారీగానే ఉన్నా ప్రభుత్వం మాత్రం తక్కువగా ప్రకటిస్తోంది. గ్రేటర్‌లోని గాంధీ ఆస్పత్రి, గచ్చిబౌలిలోని టిమ్స్‌, ప్రయివేటు ఆస్పత్రుల్లోనూ రోజుకు కనీసం 100మందికిపైగానే మరణిస్తున్నారని పలువురు వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆదివారం ఒక్కరోజే గాంధీ, టిమ్స్‌లో 115మంది మృతి చెందారు. కరోనా మృతదేహాలకు జీహెచ్‌ఎంసీ ఉచితంగా అంత్యక్రియలు నిర్వహిస్తామని చెబుతున్నారే తప్ప అధికారికంగా ఎలాంటి ఉత్తర్వులు జారీచేయలేదు. ఫలితంగా అంత్యక్రియలకు భారీగా వసూలు చేస్తున్నారు. మార్చురీలో శవం ఇవ్వడానికి రూ.5వేల నుంచి 10వేలు వసూలు చేస్తున్నారు. శవాన్ని తీసుకెళ్లడానికి అంబులెన్స్‌కు రూ.25వేలకుపైగానే తీసుకుంటున్నారు. ఇక అంత్యక్రియలు చేయడానికి రూ.25 వేల కంటే ఎక్కువే గానీ తక్కువ మాత్రం తీసుకుంటలేరనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పైసలిస్తే తప్ప శవం బయటికి రాకపోవడంతో.. కరోనా వైద్యానికే ఉన్నదంతా ఉచ్చిపెడితే.. అంత్యక్రియలకు డబ్బులు ఎక్కడ్నుంచి తేవాలని బాధితులు వాపోతున్నారు.గ్రేటర్‌ పరిధిలోని ఐదు ప్రాంతాల్లో గ్యాస్‌ ఆధారిత దహనవాటికలను నిర్వహించనున్నట్టు రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ నిర్ణయించింది. చార్మినార్‌, సికింద్రాబాద్‌, కూకట్‌పల్లి, ఖైరతాబాద్‌, ఎల్బీనగర్‌ జోన్ల పరిధిలో 5 అధునాతన దహనవాటికలు నిర్మించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఒక్కోదానికి రూ.70 లక్షల వ్యయంతో రూ.3.5 కోట్లతో పనులు చేపట్టాలని టెండర్లు సైతం ఫైనల్‌ చేసింది. కాని ఏడాదికావొస్తున్నా ఆ ఊసేలేదు. ఒక్క గ్యాస్‌ ఆధారిత దహనవాటికలో రెండు గంటలకు ఒక శవాన్ని కాల్చేస్తోంది. అందుకు రోజుకు 12 శవాలను కాల్చడానికి అవకాశముంది. విద్యుత్‌ దహనవాటికలో అయితే నాలుగు గంటలకు ఒక శవాన్ని కాల్చేస్తున్నారు. నగరంలో 960 శ్మశానవాటికలున్నాయి. వాటిల్లో కనీస సౌకర్యాలులేక నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
బన్సీలాల్‌పేట, పంజాగుట్ట, అంబర్‌పేట్‌, పంజాగుట్ట, ఎస్‌ఆర్‌నగర్‌తోపాటు ఆధునిక సౌకర్యాలున్న మహాప్రస్థానంలో మాత్రమే విద్యుత్‌ దహన వాటికలున్నాయి. వీటిలో ఐదు మాత్రమే పనిచేస్తున్నాయి. పంజాగుట్ట, బన్సీలాల్‌పేట్‌ దహనవాటికలపై స్థానికులు అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు. అయితే ఎల్‌బీ నగర్‌ జోన్‌లోని సాహెబ్‌నగర్‌ శ్మశానవాటిక జనసంచారానికి దూరంగా ఉంటుంది. సాహెబ్‌నగర్‌ శ్మశానవాటికలో కరోనా మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించాలని సంబంధిత అధికారులను మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి  ఆదేశించారు. మరి.. అక్కడి స్థానికులు ఏమంటారో.. వేచి చూడాల్సిందే.

Related Posts