YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

వైద్య సేవలు ప్రభుత్వాల కనీస ప్రాథమిక బాధ్యత టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్

వైద్య సేవలు ప్రభుత్వాల కనీస ప్రాథమిక బాధ్యత  టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్

హైదరాబాద్
వైద్య సేవలు ప్రభుత్వాల కనీస ప్రాథమిక బాధ్యతఅని  టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.  అయన కరోనో వైద్యం చేయించుకుంటూనే ఆసుపత్రి నుంచి వీడియో సందేశం పంపించారు. కరోనా ను ఆరోగ్య శ్రీ పథకంలో చేర్చాలి..
పేదలకు ఉచితంగా నాణ్యమైన వైద్య అందించాలి. నా ఆరోగ్యం గురించి ప్రార్థించిన స్నేహితులు, శ్రేయోభిలాషులు, కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు ప్రతి ఒక్కరికి పేరు పేరు నా కృతజ్ఞతలు. మీ దీవెనలతో రెండు మూడు రోజులలో ఇంటికి డిశ్చార్గ్ అవుతాను. కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు కరోనో బాధితుల కోసం గాంధీ భవన తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి సేవలు చేస్తున్నారు.  వారందరినీ అభినందిస్తున్నా.. గర్వపడుతున్నా. కరోనో ను అరికట్టడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలం అయ్యాయి. పేద ప్రజలు కరోనో బారిన పడితే వారికి వైద్య సేవలు అందక నానా కష్టాలు పడుతున్నారు. ఇది అత్యంత బాధాకరం. హాస్పిటల్స్ లో బెడ్స్ దొరకక, ఆక్సిజన్ లేక, వెంటిలేటర్స్ లేక, మందులు, రేమిడిసివర్ ఇంజెక్టన్లు దొరకక రోగులు పడుతున్న బాధలు వర్ణనాతీతమని అన్నారు. ప్రభుత్వాలు ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించడం కనీస బాధ్యత ఈ విషయంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలం కావడం దురదృష్టకరమని అయన అన్నారు. 

Related Posts