YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం విదేశీయం

అమెరికా నుంచి భారత్‌కు 100 మిలియన్‌ డాలర్ల విలువైన వైద్య సామగ్రి

అమెరికా నుంచి భారత్‌కు 100 మిలియన్‌ డాలర్ల విలువైన వైద్య సామగ్రి

న్యూ ఢిల్లీ ఏప్రిల్ 29
కరోనా వైరస్‌ విజృంభణతో కష్టకాలంలో ఉన్న భారత్‌కు సాయం కొనసాగిస్తామని అమెరికా ప్రకటించింది. ఇందులో భాగంగా 100 మిలియన్‌ డాలర్ల విలువైన వైద్య సామగ్రిని భారత్‌కు పంపిస్తున్నామని వైట్‌హౌస్‌ వర్గాలు వెల్లడించాయి. వైద్య సామాగ్రి సరఫరా చేసేందుకు కొనసాగుతున్న చర్యలకు సంబంధించి అమెరికా రక్షణ మంత్రి ఆస్టిన్‌ ట్విటర్‌ ద్వారా పంచుకున్నారు.‘కరోనాతో పోరాడుతున్న భారత్‌కు సాయం చేసేందుకు అమెరికా కట్టుబడి ఉంది. భారత్‌లో ఆరోగ్య కార్యకర్తలకు శక్తిమేరకు సాయంచేస్తాం. కరోనాకు సంబంధించిన అత్యవసర పరికరాలు గురువారం భారత్‌కు బయలుదేరుతున్నాయి. ఈ ప్రక్రియ వారం రోజులపాటు కొనసాగుతుంది. వాటిలో వెయ్యి ఆక్సిజన్ సిలిండర్లు, కోటీ 50 లక్షల ఎన్-95 మాస్‌్ాలు, 10 లక్షల ర్యాపిడ్ కిట్లు ఉన్నాయి. అంతేకాకుండా ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్‌ తయారీ సామగ్రిని భారత్‌కు పంపిస్తున్నామని, దీనిద్వారా రెండు కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను తయారు చేయవచ్చు’ అని తెలిపింది. కరోనాపై పోరులో భాగంగా యూఎస్‌ ఎయిడ్‌ కింద ఇప్పటికే నేరుగా కోటి మందికి సాయం అందించామని వెల్లడించింది. త్వరలో మరో వెయ్యి ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లు అందజేస్తామని పేర్కొంది.

Related Posts