అమరావతి
ఇంటర్ పరీక్షలపై వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా అధికారులతో విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ మాట్లాడారు. విజయవాడలోని సమగ్ర శిక్ష రాష్ట్ర కార్యాలయం నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాల జెసి, ఆర్ఐఓ, డిఈఓ లతో మంత్రి సురేష్ వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇప్పటికే ఇంటర్ ప్రాక్టీకల్ పరీక్షలు నిర్వహించుకున్నాం. మే 5 నుంచి షెడ్యూల్ ప్రకారం ఇంటర్ పరీక్షలు యధావిధిగా నిర్వహించేందుకు చర్యలు. మొత్తం 1452 కేంద్రాలు ఏర్పాటు.. గత ఏడాదికంటే 41 కేంద్రాలు అదనంగా ఏర్పాటు చేస్తున్నాం. మొదటి ఏడాది విద్యార్థులు 5,12,959 మంది, రెండవ ఏడాది 5,19,510 మంది మొత్తం 10,32,469 మంది విద్యార్థిని విద్యార్థులు హాజరు అవుతారు. ప్రతి కేంద్రంలో ఒక కోవిడ్ ప్రోటో్కాల్ అధికారి నియామకం, కోవిడ్ లక్షణాలు ఉన్న పిల్లల కోసం ప్రతి కేంద్రంలో ఒక ప్రత్యేక గది ఏర్పాటుచేస్తున్నాం. శుక్రవారం సాయంత్రం లోపు హాల్ టికెట్ లు అప్లోడ్ చేయబడతాయి. హాల్ టికెట్ వెనుక కోవిడ్ నిబంధనలు ముద్రించటం జరిగింది. అన్ని జిల్లాల్లో అధికారులు కోవిడ్ పై జాగ్రత్తలు తీసుకొని పరీక్షలకు సిద్ధం కావాలి. ఇంటర్మీడియట్ పరీక్షలు అనివార్యం అని గుర్తించాలి. ఏ రాష్ట్రంలో కూడా ఇవి రద్దు కాలేదు. కొన్నిచోట్ల నిర్వహిస్తున్నారు. మరికొన్ని చోట్ల వాయిదా వేశారు. కొన్ని రాజకీయ పార్టీలు దీనిని అనవసరంగా రాద్ధాంతం చేస్తూ విద్యార్థులు, తల్లిదండ్రుల మానసిక ధైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నాయి. ఇంటర్ ప్రాక్టీకల్ పరీక్షలు ఇప్పటికే పూర్తి చేసినందుకు అధికారులకు అభినందనలు. 5 నుంచి 23 వరకు జరిగే పరీక్షలు కోవిడ్ జాగ్రత్తలు తీసుకుంటూ దిగ్విజయంగా పూర్తి చేయాలి. వైద్య శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా చూడాలి. అన్ని సెంటర్ లపై నిఘా ఉంచి ప్రతి రోజు నేను కూడా సమీక్షిస్తా. విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధవంతంగా అమలు చేసెందుకు అధికారులు చిత్తశుద్ధితో పని చేయాలని అన్నారు.