YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

దేశీయం

అసోంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఉల్ఫా ఉగ్రవాద సంస్థ కీలక నేత హతం

అసోంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఉల్ఫా ఉగ్రవాద సంస్థ కీలక నేత హతం

పశ్చిమ అసోంలోని బొంగైగావ్‌ జిల్లాలో గురువారం తెల్లవారు జామున జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఉల్ఫా ఉగ్రవాద సంస్థకు చెందిన కీలక నేత హతమయ్యాడు. మృతుడిని ఉల్ఫా ఉగ్రవాద సంస్థకు చెందిన వెస్ట్రన్‌ కమాండర్‌ ద్విపెన్‌ సౌద్‌గా అధికారులు గుర్తించారు. ఈ సందర్భంగా మరో వ్యక్తిని పోలీసు బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. ఉన్నత వర్గాలకు చెందిన కొందరిని అపహరించేందుకు ప్రణాళికలు వేస్తున్నారన్న సమాచారాన్ని పోలీసులు అందుకొని.. కుట్రను భగ్నం చేశారు. ఈ క్రమంలో మణిక్‌పూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని బేసిమారి వద్ద కాల్పులు జరగ్గా.. పోలీసు కాల్పుల్లో ద్విపెన్‌ సౌద్‌ మృతి చెందాడు.పాండుమ్‌ రాయ్‌ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎన్‌కౌంటర్‌ స్థలం నుంచి తుపాకీతో పాటు గ్రెనేడ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సీనియర్‌, మోస్ట్‌ వాటెండ్‌ అయిన రాజ్‌ఖోమా గతేడాది పోలీసులకు లొంగిపోయిన అనంతరం.. దిపెన్‌ సౌద్‌ ఇటీవల వెస్ట్రన్‌ కమాండర్‌గా నియామకమయ్యాడు. ఇటీవల ఉల్ఫా ఉగ్రవాదులు ఓఎన్‌జీకి చెందిన ముగ్గురు కార్మికులను అపహరించిన కొద్ది రోజుల తర్వాత ఎన్‌కౌంటర్‌ చోటు చేసుకుంది. నాగాలాండ్‌లో ఇద్దరు కార్మికులను గుర్తించినా.. మరొకరి ఆచూకీ దొరకలేదు. అతను ఉల్ఫా-1 ఉగ్రవాదుల చెరలో ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

Related Posts