కేంద్ర సెన్సార్ బోర్డు అడ్వైసరి కమిటీ సభ్యునిగా జైరాం దేశిరాజుని నియమిస్తూ కేంద్ర ఇన్ఫర్మేషన్ & బ్రాడికాస్టింగ్ కార్యదర్శి విజయగోపాల్ ఆదేశాలు జారీచేశారు -గత 35 స !!గా నటుడిగా తన కెరీర్ కొనసాగిస్తూ రియల్ స్టార్ హీరో శ్రీహరి కి అత్యంత సన్నిహితుడు గా ఉంటూ వారితో ‘ శివాజీ ‘ ఒరేయ్ తమ్ముడు ‘లాంటి చిత్రాలకు ఎగ్జిక్యూటివ్ నిర్మాత గా వ్యవహరించారు జైరాం -ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తెలుగు చిత్ర పరిశ్రమ లో కొనసాగుతున్నారు -నిర్మాతగా కూడా అనుభవం ఉన్నందున ముందు ముందు మంచి అభిరుచి గల చిత్రాలు నిర్మిస్తూ నిర్మాతగా కూడా ఎదగాలని ‘ విజయ గణపతి ఫిలిమ్స్ ‘అనే పేరుతో బ్యానర్ ని కూడా పెట్టబోతున్నట్లు గా వారు తెలిపారు -క్యారెక్టర్ఆర్టిస్ట్ గా నిర్మాత గా అటు చిత్రపరిశ్రమలోని వారికీ ఇటు ప్రేక్షకులకి వారు సుపరిచుతులే -రెండేళ్లపాటు సెన్సార్ బోర్డు సభ్యునిగా కొనసాగనున్న జైరాం మాట్లాడుతూ తనకి కేటాయించిన పదవి భాద్యతలను చిత్తశుద్ధి తో నిర్వహిస్తానని తెలిపారు
యువతకు నిశానిర్దేశం చేసేవి , కుటుంబ సభ్యులతో కలిసి చూసే చిత్రాలకు ప్రాధాన్యమిస్తానని వారు తెలిపారు