నగరంలోని కూకట్పల్లిలో కాల్పుల ఘటనపై సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ మాట్లాడారు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వద్ద ఏటీఎంలో డబ్బులు రీఫిల్ చేస్తున్న వారిపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై కాల్పులు జరిపారు. ఘటనలో సెక్యురిటి గార్డు అలీ మృతి చెందాడు. సీపీ మాట్లాడుతూమధ్యాహ్నం 01:45 నిమిషాలకు కూకట్ పల్లి ఎటిఎం లో చోరీ జరిగింది. రెక్కి చేసి చోరీకి పాల్పడ్డారు. నిందితులు పాత నేరస్తులుగా అనుయానిస్తున్నాం. కాల్పుల్లో మాజీ సీఆర్ఫిఎఫ్ జవాన్ అలీ చనిపోయాడు. గాయపడి శ్రీనివాస్ ను హాస్పత్రికి తరలించారు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ స్టాఫ్ ఒకరు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో కాల్పులు జరిపారు. ఐదు లక్షలు తీసుకొని పారిపోయారు. దోపిడీకి కంట్రీ మేడ్ రివాల్వర్ యూజ్ చేశారు. ఒక మ్యాగజైన్ స్వాధీనం చేసుకున్నా్. ఇది బయట గ్యాంగ్ పనే అని అయన అన్నారు. కాల్చిన తీరు చూస్తే వాళ్లు పక్క ప్రొఫెషనల్స్. ఖచ్చితంగా పట్టుకుంటాం. ఎస్ ఓ టి, లా అండ్ ఆర్డర్ పోలీసులు కలిసి ఆరు స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేశామమని అయన అన్నారు.