YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

కోమటిరెడ్డి, సంపత్‌ల సభ్యత్వ రద్దుపై హైకోర్టులో విచారణ సింగిల్ జడ్జ్‌ తీర్పును కొట్టవేయాలని టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేల అప్పీల్‌

కోమటిరెడ్డి, సంపత్‌ల సభ్యత్వ రద్దుపై హైకోర్టులో విచారణ   సింగిల్ జడ్జ్‌ తీర్పును కొట్టవేయాలని టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేల అప్పీల్‌

కాంగ్రెస్‌ నేతలు కోమటిరెడ్డి, సంపత్‌కుమార్‌ల శాసనసభ సభ్యత్వ నమోదు రద్దుపై సింగిల్ జడ్జ్‌ తీర్పును కొట్టివేయాలని ఇటీవల టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు హైకోర్టులో అప్పీల్‌ చేశారు. దీనిపై శుక్రవారం న్యాయస్థానంలో విచారణ జరిగింది. టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలకు అప్పీలు చేసే అర్హత లేదని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్ కుమార్‌ల తరఫు న్యాయవాది అన్నారు.అయితే, శాసన సభ్యులు కాబట్టి అప్పీలు అర్హత ఉంటుందని టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేల న్యాయవాది వాదించారు. అలాగే, కాంగ్రెస్‌ నేతలు కోమటిరెడ్డి, సంపత్‌కుమార్‌లు అసెంబ్లీ ప్రవర్తించిన తీరుపై మీడియాలో ప్రసారమైన వీడియోలను సదరు న్యాయవాది హైకోర్టుకు సమర్పించారు. దీంతో శాసన సభ్యత్వం రద్దు చేసే ముందు సదరు ఎమ్మెల్యేల వివరణ తీసుకోవాలి కదా? అని కోర్టు ప్రశ్నించింది. అనంతరం తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

Related Posts