YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఏపీ బైడన్ గా చంద్రబాబు

ఏపీ బైడన్ గా చంద్రబాబు

విజయవాడ, ఏప్రిల్ 30, 
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రాజకీయ అనుభవం ఒకందుకు ఉపయోగపడుతుంది. జగన్ వైఫల్యాన్ని అంతర్జాతీయంగా ముడిపెట్టేందుకు కూడా చంద్రబాబు ఎక్సపీరియన్స్ బాగానే ఉపయోగపడుతుంది. ఇటీవల చంద్రబాబు జగన్ తో ట్రంప్ ను పోల్చడం ఇందుకు ఉదాహరణ. ట్రంప్ అమెరికా అధ్యక్ష పదవి నుంచి దిగిపోయి జోబైడెన్ వచ్చిన తర్వాత కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని చంద్రబాబు చెప్పారు. అక్కడ పద్ధతిగా, ముందు చూపుతో వెళ్లడం వల్లనే కరోనా తగ్గుముఖం పట్టిందన్నారు చంద్రబాబు.
అంటే జగన్ దిగిపోతే తప్ప కరోనా తగ్గదని ఆయన చెప్పకనే చెప్పారన్న మాట. జోబైడెన్ ను తనతో పరోక్షంగా పోల్చుకున్నారు. జగన్ కు అసలు ముందు చూపులేదన్నారు. కనీసం మౌలిక సదుపాయాలు కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యారన్నారు. ఆసుపత్రుల్లో బెడ్స్ కొరత తీవ్రంగా ఉందని, బెడ్స్ సంఖ్య పెంచాలని ఈ ముఖ్యమంత్రికి తెలియదా? అని చంద్రబాబు సూటిగానే ప్రశ్నించారు. కానీ ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఆసుపత్రుల్లో ఏ రకమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తారన్న ప్రశ్న సూటిగా ఆయనకే తగులుతుంది.జగన్ కు అస్సలు పాలన చేతకాదని చంద్రబాబు పదే పదే చెబుతున్నారు. మరి రెండేళ్ల పాలనను చూసి ప్రజలు వైసీపీని ప్రతి ఎన్నికల్లో ఎలా గెలిపించారని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. దేశంలో ప్రతి రాష్ట్రంలో కరోనా సమయంలో ఆసుపత్రుల్లో బెడ్స్ కొరత, ఆక్సిజన్ కొరత సర్వ సాధారణంగా మారింది. అయితే దీనిని ఏపీకే పరిమితం చేసి చంద్రబాబు మాట్లాడటం విడ్డూరంగా ఉందంటున్నారు.ఇక ప్రజలను భయపడవద్దని చెబుతున్న చంద్రబాబు తాను హైదరాబాద్ లోని ఇంటిని వదిలి ఎందుకు రావడం లేదని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కరోనా సమస్యను కూడా చంద్రబాబు తన రాజకీయాల అవసరాల కోసమే ఉపయోగించుకుంటున్నారని చెబుతున్నారు. టెస్ట్ లు ఎక్కువ సంఖ్యలో చేయడం వల్లనే పదిలక్షలకు పైగా కేసులు నమోదయ్యాయని, ఇతర రాష్ట్రాల్లో ఇంతకు మించి కేసులున్నాయని గుర్తుంచుకోవాలని చంద్రబాబుకు హితవు పలుకుతున్నారు. జూమ్ యాప్ ద్వారా జగన్ ను ఆడిపోసుకుంటే లాభం లేదని, జనంలోకి వచ్చి మాట్లాడాలని వైసీపీ నేతలు సవాల్ విసురుతున్నారు

Related Posts