YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఆపరేషన్ ఆకర్ష్ ....

ఆపరేషన్ ఆకర్ష్ ....

విశాఖపట్టణం, ఏప్రిల్ 30, 
ఏపీలో మళ్లీ రాజకీయ కప్పగెంతులకు టైమ్ వచ్చేసినట్లుగా ఉంది. ఢీ అంటే ఢీ కొడుతున్న టీడీపీని చాలా వరకూ ఎన్నికలలో ఓడించడం ద్వారా దెబ్బతీసిన వైసీపీ ఇపుడు ఓడి వాడిన పసుపు శిబిరం పస తేల్చే పనిలో పడిందంటున్నారు. ఏపీలో రాజకీయంగా బలంగా వైసీపీ ఉంది. మరో మూడేళ్ల వరకూ అధికారానికి ఎలాంటి ఢోకా లేదు. ఈ సంగతి చంద్రబాబు కావాలని విస్మరించినా తమ్ముళ్లకు తెలియనిది కాదు. సరిగ్గా ఈ పాయింట్ నే ఆసరాగా చేసుకుని టీడీపీకి గట్టి షాక్ ఇవ్వడానికి వైసీపీ రెడీ అయిపోయింది.
టీడీపీ ఓడినా బలమైన నేతలు ఇంకా ఆ పార్టీఎని పట్టుకుని ఉన్నారు. వారు ఇప్పటిదాకా అనుకున్నది వేరు జరుగుతున్నది వేరు అన్నట్లుగా పొలిటికల్ సీన్ ఉంది. రాజకీయాలల్లో ఒక పార్టీ గెలిస్తే మరో పార్టీ ఓడడం కామన్. మరో ఎన్నికలో టీడీపీ వస్తుంది అన్న నమ్మకం అయితే నిన్నటిదాకా ఉండేది, ఇటు సొంత టీడీపీలో చూస్తే చంద్రబాబు పోరాట పటిమ మీద డౌట్లు వచ్చేస్తున్నాయి. భావి నేతగా లోకేష్ ఎదగలేకపోతున్నారు. ఈ మధనమే ఇపుడు వారిని పక్క చూపులు చూడాల్సిన పరిస్థితిని కల్పిస్తోందని అంటున్నారు.ఈ నేపధ్యం రాజకీయంగా తమకు కలసివస్తుందని వైసీపీ నాయకత్వం అభిప్రాయపడుతోంది. దీంతో వైసీపీ నుంచి కొందరు కీలకమైన నేతలను బరిలోకి దింపి మరీ ఆపరేషన్ ఆకర్ష్ కి తెర తీస్తున్నారు అని ప్రచారంలో ఉంది. ఉత్తరాంధ్ర విషయానికి వస్తే సీనియర్ మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణ శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలలోని టీడీపీ నేతలకు గేలం వేస్తున్నారు అంటున్నారు. ఆయన ఏకంగా ఏపీ టీడీపీ మాజీ ప్రెసిడెంట్ కళా వెంకటరావుని పార్టీలోకి ఆహ్వానిస్తున్నారని టాక్ నడుస్తోంది. కళా ఫ్యామిలీ చాలా పెద్దది, పైగా రెండు జిల్లాలలో కలుపుకుని మూడు నాలుగు అసెంబ్లీ సీట్లలో వారి ప్రభావం ఉంది. దాంతో పాటు సొంత సామాజికవర్గం కూడా కావడంతో కళాను బొత్స వైసీపీలోకి తీసుకురావాలనుకుంటున్నారుట.విశాఖను వైసీపీకి కంచుకోటగా మార్చే పనిలో విజయసాయిరెడ్డి బిజీగా ఉన్నారని అంటున్నారు. ఆయన గేలానికి ఒక టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్సీ ఇప్పటికే చిక్కారని ప్రచారం సాగుతోంది. ఆయన గత కొంతకాలంగా టీడీపీ అధినాయకత్వం పోడకల పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు అంటున్నారు. ఆయనతో పాటు మరికొంతమంది మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతల మీద కూడా సాయిరెడ్డి గురి పెట్టారని అంటున్నారు. వీరంతా వస్తే కనుక విశాఖ జిల్లాలో టీడీపీ కి అతి పెద్ద బ్రేకులు పడిపోతాయని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో?

Related Posts