YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

కుమారస్వామి కామ్...అయిపోయారే

కుమారస్వామి కామ్...అయిపోయారే

బెంగళూర్, ఏప్రిల్ 30, 
కర్ణాటకలో జనతాదళ్ ఎస్ కు ఎన్నడూ లేని కష్టాలను చూస్తుంది. ముఖ్యంగా గత రెండేళ్ల నుంచి పార్టీ పీకల్లోతు కష్టాల్లో పడిపోయింది. క్యాడర్ లో కూడా నిరాశా నిస్పృహలు అలుముకున్నాయి. ఎన్నికలకు దూరంగా ఉండటమూ ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారింది. దేవెగౌడకు వయసు మీద పడటం, కుమారస్వామి కప్పగంతులతో జేడీఎస్ ప్రజలకు కూడా దూరమయిందంటున్నారు.దేవెగౌడ పార్టి పెట్టినప్పుడు ప్రాంతీయ పార్టీ. కన్నడ నాట ఒక సామాజికవర్గం బలమైన అండతో పాటు మిగిలిన సామాజికవర్గాలు కూడా అండగా నిలిచేవి. కాని ఇప్పుడు అదే పార్టీ ఉప ప్రాంతీయ పార్టీగా మిగిలిపోయింది. కేవలం అతి తక్కువ ప్రాంతాలకే పరిమితమయింది. ప్రధానంగా కుమారస్వామి 14 నెలలు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా క్యాడర్ కు ఏమీ చేయలేెకపోయారన్న అపప్రధను ఎదుర్కొన్నారు. కుటుంబ పరంగా కూడా అనేక ఇబ్బందులున్నాయి.ఇక 2019లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఎన్నడూ లేని విధంగా కుమారస్వామి కుటుంబానికి ప్రజలు షాకిచ్చారు. దేవెగౌడ, ఆయన మనవడు నిఖిల్ గౌడ ఓటమి తో పార్టీ మరింత డీలా పడింది. దీంతో కుమారస్వామి క్యాడర్ లో ఉత్సాహం నింపేందుకు చేసిన ప్రయత్నాలు పెద్దగా ఫలించలేదు. ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ ను నియమించుకున్నా ఆయన ఇతర రాష్ట్రాల ఎన్నికల్లో బిజీగా ఉండటంతో ఇక్కడ దృష్టి పెట్టలేదు.ఇప్పుడు కర్ణాటకలో జరుగుతున్న మూడు ఉప ఎన్నికల్లో ఒకచోట మాత్రమే జేడీఎస్ బరిలోకి దిగింది. కన్నడ నాట మస్కి, బసవకల్యాణ అసెంబ్లీతో పాటు బెళగావి పార్లమెంటు నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరిగాయి. ఇందులో బసవక‌ల్యాణలోనే జేడీఎస్ తన అభ్యర్థిని బరిలోకి దింపింది. ప్రధాన పోటీ కాంగ్రెస్, బీజేపీ మధ్యనే ఉండటంతో ఉప ఎన్నికల్లోనూ జేడీఎస్ ఏమాత్రం ప్రభావం చూపే అవకాశం లేదు. వచ్చే ఎన్నికలకు కాంగ్రెస్, బీజేపీలు ఇప్పటి నుంచే సమాయత్తమవుతున్నా కుమారస్వామిలో మాత్రం కదలికలు ఏమాత్రం లేవన్న విమర్శలు విన్పిస్తున్నాయి.

Related Posts