YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

108 వైద్య సేవా సిబ్బంది వేతనాలు పెంచుతాం

108 వైద్య సేవా సిబ్బంది వేతనాలు పెంచుతాం

ఏపీలో పనిచేస్తున్న 108 వైద్య సేవా సిబ్బంది వేతనాలు పెంచుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అయితే, వారు డిమాండ్ చేస్తున్నట్లు మూడు  షిఫ్టుల ఏర్పాటు వీలుకాదని అన్నారు. శుక్రవారం నాడు సచివాలయంలో సియంను  రాష్ట్ర 108 కాంట్రాక్ట్  ఎంప్లాయిస్ యూనియన్ ప్రతినిధులు కలిసారు.  108 వాహనాలలో పనిచేస్తూ సేవలు అందిస్తున్న ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్లకు రూ.11,500 పైలెట్లకు రూ. 10,500 చెల్లిస్తున్నారని రాష్ట్ర 108 కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ యూనియన్ నేతలు సియంకు వివరించారు. 50% జీతాలు పెంచాలని, అలా పెంచడంలో ఇబ్బందులు ఉన్న పక్షంలో తెలంగాణ రాష్ట్రంలోలా సగటున రూ. 4,000 పెంచాలని 108 కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ యూనియన్ ప్రతినిధులు డిమాండ్ చేసారు. అత్యవసర వైద్యసేవలు అయినందువల్ల 8 గంటల విధుల నిర్వహణ విధానం అమలు వీలుకాదని,  రెండు షిఫ్టులలో 108 ఉద్యోగులు పనిచేయాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రభుత్వానికి మంచిపేరు తెండని చెప్పారు. 

Related Posts