YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

మారుతున్న కొవిడ్ లక్షణాలు

మారుతున్న కొవిడ్ లక్షణాలు

హైదరాబాద్, ఏప్రిల్ 30, 
ఏడాది క్రితం కరోనా వచ్చినప్పుడు జ్వరం, జలుబు, దగ్గు, విరేచనాలు కొవిడ్‌‌‌‌ లక్షణాలుగా చెప్పుకున్నాం. కానీ, ఇప్పుడు కొత్త స్ట్రెయిన్ వచ్చాక మోకాళ్ల కింద నొప్పులు, నడుము నొప్పి, తలనొప్పి, ఆకలి లేకపోవడం కూడా తోడయ్యాయి. కొవిడ్‌‌‌‌ పేషెంట్స్ బాగా నీరసిస్తారు. ఆకలి లేకపోవడం కూడా కొవిడ్‌‌‌‌ లక్షణం. ఇలా ఉన్న వాళ్లు ఘనాహారం తీసుకోలేరు. అలాంటప్పుడు లిక్విడ్ ఫుడ్ తీసుకునే ప్రయత్నం చేయాలి.
సమస్య తీవ్రత ఎలా ఉంది?
ఏడాది కింద కొవిడ్‌‌‌‌ పేషెంట్స్ హాస్పిటల్లో చేరాల్సిన అవసరం వచ్చినవాళ్లలో 20 శాతం మందికే వెంటిలేటర్ అవసరం పడేది. ఇప్పుడు పరిస్థితి మారింది. హాస్పిటల్లో చేరాల్సి వచ్చిన పేషెంట్లలో 80 శాతం మందికి వెంటిలేటర్స్ అవసరం పడుతున్నాయి. ఒకప్పుడు వృద్ధులే హాస్పిటల్లో చేరాల్సి వచ్చేది. వాళ్లలో బీపీ, షుగర్, ఆస్తమా పేషెంట్స్కే సమస్య తీవ్రంగా ఉండేది. కానీ, కొత్త స్ట్రెయిన్ కరోనా సోకినవాళ్లు అంతకుముందు ఆరోగ్యంగా ఉన్నా కూడా చాలా బాధపడుతున్నారు. ఆస్తమా, బీపీ, షుగర్ వంటి ఆరోగ్య సమస్యలు లేని వృద్ధులే కాదు, అన్ని వయసుల వాళ్లూ హాస్పిటల్లో చేరాల్సి వస్తోంది. నడి వయసు వాళ్లు, యువతకి కూడా ఈ స్ట్రెయిన్తో ప్రాణహాని ఉందని అర్థమవుతోంది. ఇప్పుడు ఈ వయసు వాళ్లకే ప్రమాదం అనుకునే పరిస్థితి లేదు. కానీ, పిల్లలకు సమస్య తక్కువగా ఉంది. వాళ్లకు వెంటిలేషన్ అవసరంపడట్లేదు. కొవిడ్‌‌‌‌ వస్తే అందరూ హాస్పిటల్లో చేరాల్సిన అవసరం రాదు. పాజిటివ్ అని తెలిస్తే డాక్టర్ని ముందు కన్సల్ట్ చేయాలి. చెప్పిన మందులు వాడాలి. జ్వరం తీవ్రంగా, తగ్గకుండా ఉంటే హాస్పిటల్లో చేరాల్సిన అవసరం వస్తుంది. ఆక్సీమీటర్తో బాడీలో ఆక్సిజన్ శాతాన్ని చెక్ చేసుకుంటూ ఉండాలి. ప్రతి రోజూ ఇలా చెక్ చేసుకోవాలి. ఎస్పీఓటూ 94 కు తగ్గితే అప్పుడు కచ్చితంగా హాస్పిటల్లో చేరాలి. పాజిటవ్ వచ్చిన కొన్నాళ్ల తర్వాత కొవిడ్‌‌‌‌ తగ్గుతుంది. నెగెటివ్ రిపోర్ట్ వస్తుంది. ఆ తర్వాత కొంత మంది హార్ట్ ఎటాక్ తో చనిపోతున్నారని అంటున్నారు. దీనికి కారణం డి – డైమర్ (రక్త నాళాల్లో రక్తం గడ్డ కట్టడం) జరగడం. కరోనా నెగెటివ్ రిజల్ట్ వచ్చిన తరవాత బాడీలో రక్తం గడ్డ కడుతుందా? లేదా అని తెలుసుకోవడం కోసం డి – డైమర్ టెస్ట్ చేయించుకోవాలి. సమస్య ఉందని గుర్తిస్తే రక్తం పలుచగా అవ్వడానికి ట్యాబ్లెట్స్, ఇంజెక్షన్స్ ఇస్తారు. కొవిడ్‌‌‌‌ తగ్గిందని అజాగ్రత్తగా ఉండకూడదు. కొద్ది రోజులు జాగ్రత్తగా ఉండాలి. అవసరమైతే డాక్టర్ని కన్సల్ట్ చేయాలిఇంతకుముందు కిడ్నీ, బీపీ, షుగర్, ఆస్తమా పేషెంట్స్ జాగ్రత్తగా ఉండాలని చెప్పేవారు. వాళ్లే ఎక్కువగా ఇబ్బంది పడ్డారు కూడా. వెంటిలేటర్స్ అవసరం కూడా వాళ్లకే ఎక్కువగా ఉండేది. ఇప్పుడు పరిస్థితులు అలా లేవు. బాడీలో ఏ అవయవం అయినా కొవిడ్‌‌‌‌ వల్ల సరిగా పనిచేయకపోవచ్చు. ఏ ఆర్గాన్లో ఎఫెక్ట్ చూపిస్తుందో ఊహించలేం. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాల్సిందే. జీర్ణ, శ్వాస, నాడీ వ్యవస్థలపై కోవిడ్ ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఇంతకు ముందు ఏ జబ్బు లేకపోయినా ఇబ్బంది పడుతున్నారు కొందరు.
ఎన్ని రోజుల్లో కోలుకుంటారు?
సాధారణంగా కొవిడ్‌‌‌‌ పేషెంట్ కోలుకోవడానికి పద్నాలుగు రోజులు పడుతుంది. కొంతమంది మూడు రోజుల్లోనే కోలుకుంటారు. వెంటిలేటర్ అవసరం వచ్చి, చికిత్స చేయించుకున్నవాళ్లు కోలుకోవడానికి పద్నాలుగు రోజుల కంటే ఎక్కువ కాలం పడుతుంది. ప్రత్యేకించి ఇన్ని రోజులని చెప్పలేం. కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే ఫిజికల్ డిస్టెన్స్ పాటించాలి, మాస్క్ తప్పనిసరిగా పెట్టుకోవాలి. తర్వాత కొవిడ్‌‌‌‌ టెస్ట్ చేయించుకోవాలి. సీరియస్గా లేదని నిర్లక్ష్యం చేస్తే ఇంట్లో ఉన్న పెద్దవాళ్లకు ప్రమాదం. కుటుంబ సభ్యులు, ఆఫీస్లో కొలిగ్స్కి సోకే ప్రమాదం ఉంటుంది. పాజిటివ్ వస్తే హాస్పిటల్లో చేరాల్సిన అవసరం లేకున్నా డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. పాజిటివ్ వచ్చినవాళ్లు హోం ఐసోలేషన్ పాటించాలి. వేడి నీళ్లు తాగాలి. ఆవిరి పడుతూ ఉండాలి. మల్టీ విటమిన్ ట్యాబ్లెట్స్ తీసుకోవాలి. ఇమ్యూనిటీకి విటమిన్ – సి, జింక్ ముఖ్యం. ఇవి కాకుండా విటమిన్ – ఏ, డీ, ఈ, బీ కాంప్లెక్స్ విటమిన్లు కూడా ఇమ్యూనిటీని పెంచడానికి సాయ పడతాయి. అందువల్ల అందరూ మల్టీ విటమిన్ ట్యాబ్లెట్స్ తీసుకోవాలి. యాంటీ బయాటిక్స్, ఇతర మందులు అందరికీ అవసరం లేదు. జ్వరం, జలుబు, నొప్పులు వస్తే లక్షణాన్ని బట్టి మందులు తీసుకోవాలి. కొవిడ్‌‌‌‌ పాజిటివ్ వచ్చినవాళ్లు ఈ మందులు వాడాలంటూ వాట్సాప్లో వచ్చే మందులన్నీ కొని వాడొద్దు. అందరికీ అన్ని రకాల మందులు అవసరమవ్వవు. జ్వరం, దగ్గు ఉంటే యాంటి బయాటిక్స్ తీసుకోవాలి. పాజిటివ్ పేషెంట్స్ అందరూ యాంటి బయాటిక్స్ వాడాల్సిన అవసరం లేదు.

Related Posts