ఒంగోలు
ప్రకాశం జిల్లాలో ఓ పోలీసు హెడ్ కానిస్టేబుల్ మానవత్వాన్ని చాటుకున్నాడు. దోర్నాల పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ సురేష్ పనిచేస్తున్నాడు. గుర్తు తెలియని మృతదేహాన్ని కర్ర సాయంతో భుజాన వేసుకొని కిలోమీటరు మోసి మానవత్వాన్ని చాటుకున్నాడు. దోర్నాల మండలం మర్రి పాలెం అడవి ప్రాంతంలో గుర్తుతెలియని మృతదేహాన్ని తరలించేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో మృతదేహానికి కర్రకు కట్టుకొని మోసుకుంటూ కిలోమీటర్ మేర తరలించి మానవత్వం చాటుకున్నాడు.