YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

హైదరాబాద్ లోని అమీర్ పేట కు మారిన యుఐడిఎఐ ప్రాంతీయ కార్యాలయం

హైదరాబాద్ లోని అమీర్ పేట కు మారిన యుఐడిఎఐ ప్రాంతీయ కార్యాలయం

యూనీక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యుఐడిఎఐ) ప్రాంతీయ కార్యాలయాన్ని హైదరాబాద్ మాదాపూర్ లోని మై హోం హబ్ నుండి అమీర్ పేట లోని స్వర్ణజయంతి కాంప్లెక్స్ కు మార్చినట్లు యుఐడిఎఐ ప్రాంతీయ కార్యాలయం అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ ఎన్.ఎస్. దీపు ఒక ప్రకటనలో తెలిపారు.  యుఐడిఎఐ ప్రాంతీయ కార్యాలయం కొత్త చిరునామా 605-612, ఈస్ట్ బ్లాక్, ఆరో అంతస్తు, స్వర్ణజయంతి కమర్షియల్ కాంప్లెక్స్, మైత్రివనం కాంప్లెక్స్ పక్కన, అమీర్ పేట, హైదరాబాద్ గా మారినట్లు  యుఐడిఎఐ ప్రాంతీయ కార్యాలయ అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ పేర్కొన్నారు.  కేంద్ర ప్రభుత్వ ఆర్థిక తదితర సబ్సిడీలు, ప్రయోజనాలు మరియు సేవలను లక్షిత లబ్ధిదారులైన పౌరులకు అందించేందుకు వారికి ‘‘ఆధార్’’ పేరుతో ఒక విశిష్ట గుర్తింపు సంఖ్య ను (యుఐడి) వారికి జారీ చేసేందుకుగాను యుఐడిఎఐ ను ఏర్పాటు చేయడమైంది.  ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ లో భాగంగా యుఐడిఎఐ పనిచేస్తోంది. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతమైన అండమాన్ మరియు నికోబార్ దీవులు యుఐడిఎఐ హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయం పరిధిలో ఉన్నాయి.

Related Posts