YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

జేపీ నడ్డాకు ఎన్నికలకు చావో, రేవో

జేపీ నడ్డాకు ఎన్నికలకు చావో, రేవో

న్యూఢిల్లీ, మే 1, 
భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఉన్నా ఇప్పుడు జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఆయన ప్రభావం ఎంతమాత్రం లేదు. ఆయన జోక్యం కూడా లేదు. అభ్యర్థుల ఎంపికలోనూ, ప్రచార వ్యూహంలోనూన జేపీనడ్డా పాత్ర నామమాత్రమనే చెప్పాలి. జేపీ నడ్డా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి ఏడాది పైగా కావస్తుంది. ఈ ఎన్నికల్లో గెలుపోటములు ఏది వచ్చినా ఆయనకే సహజంగా రావాల్సి ఉంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయనకు ఓటమి ఒక్కటే ఆపాదించే అవకాశాలు కన్పిస్తున్నాయి.భారతీయ జనతా పార్టీకి ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలు కీలకం. కనీసం పశ్చిమ బెంగాల్ లో గెలిస్తే కొంత వరకూ ఊరట లభిస్తుంది. అక్కడ కూడా ఆశించనంత అవకాశాలు కన్పించడం లేదు. అసోం లో కొంత పరిస్థితి మెరుగ్గానే ఉందంటున్నారు. తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ రాష్ట్రాల్లో అవకాశాలే లేవు. ఎక్కువగా జేపీ నడ్డాను దక్షిణాది ప్రాంతానికే ప్రచారానికి పరిమితం చేశారన్న వ్యాఖ్యలు పార్టీ నుంచి విన్పిస్తున్నాయి.పశ్చిమ బెంగాల్ లో జేపీ నడ్డా అడపా దడపా పర్యటించినా ఆయన ఎక్కువగా తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి ప్రాంతాల్లోనే ఎక్కువగా ప్రచారంలో కనిపించారు. ఈ మూడు రాష్ట్రాల్లో బీజేపీకి అవకాశాలు లేవనే చెప్పాలి. ఇక ప్రధాని నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షాలు ప్రచార బాధ్యతనంతా తమ భుజాన వేసుకున్నారు. పశ్చిమ బెంగాల్, అసోంలోనే వీరిద్దరూ ఎక్కువగా ప్రచారంలో పాల్గొనడం విశేషం.జేపీ నడ్డాను అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం వరకూ దూరంగా ఉంచారని విమర్శ పార్టీ నుంచే విమర్శలు విన్పిస్తున్నాయి. ఆయన కు పెద్దగా చరిష్మా లేకపోవడం, ప్రసంగాల్లో కూడా పదును లేకపోవడంతో ఆయనను పెద్దగా రాష్ట్ర నేతలు కూడా పట్టించుకోలేదు. మోదీ, అమిత్ షాలకు నమ్మకమైన వ్యక్తి కావడంతోనే ఆయనకు అధ్యక్ష పదవి దక్కింది. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు వచ్చినా జేపీ నడ్డాకు మాత్రం పోయేదేమీ లేదని ఆయన వర్గం నేతలు అంటున్నారు. మొత్తం మీద జేపీ నడ్డా అధ్యక్షుడిగా ఉన్నా అంతా మోదీ, అమిత్ షాలు మాత్రమే ఎన్నికలను పర్యవేక్షించారు.

Related Posts