YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ఈటెలపై భు దందా ఆరోపణలు

ఈటెలపై భు దందా ఆరోపణలు

హైదరాబాద్, మే 1, 
మెదక్ జిల్లాలో భారీ భూ దందా..పేద రైతులకు చెందిన వంద ఎకరాల అసైన్డ్ భూమి ఆక్రమణకు గురైంది. మంత్రి ఈటల పైనే ప్రధానంగా ఆరోపణలు వినిపిస్తుండడం పొలిటికల్ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. మంత్రి ఈటలపై ఇప్పటికే సీఎం కేసీఆర్ కు బాధితులు ఫిర్యాదు చేశారు. తమ భూములను మంత్రి ఈటల, ఆయన అనుచరులు ఆక్రమించారంటూ..ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.మెదక్ జిల్లాలోని అసైన్డ్ భూములను ఈటల బలవంతంగా భూములు లాక్కుంటున్నారని బాధితులు వెల్లడిస్తున్నారు. మూసాయిపేట మండలం అచంపేట, హకీంపేట గ్రామాల్లోని 100 ఎకరాలను ఇప్పటికే ఆక్రమించారంటూ వారు ఆరోపణలు గుప్పిస్తున్నారు. కొంత భూమిని ఈటల కుటుంబీకుల పేరుతోనే రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈటల అనుచరులు అల్లి సుదర్శన్, యంజాల సుధాకర్ రెడ్డిలు కబ్జాకాండ కొనసాగిస్తున్నారంటూ..సీఎంకు ఫిర్యాదు చేశారు.అసైన్డ్ భూములను ప్రభుత్వం తిరిగి..స్వాధీనం చేసుకుంటుందని బెదిరించి భూములు లాక్కొన్నారని రైతులు వెల్లడిస్తున్నారు. మూసాయిపేట మండలంలోని వంద మంది రైతుల భూములను ఈటల అనుచరులు లాక్కొన్నారంటూ..సీఎంకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ భూముల్లో ఫౌల్ట్రీ షెడ్ లను నిర్మిస్తున్నారంటూ..ఫిర్యాదులో బాధితులు వెల్లడించారు.చుట్టుపక్కల భూముల్లోకి వెళ్లకుండా..దారని మూసేశారంటూ..రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చుట్టుపక్కల భూములు ఇచ్చేయాలంటూ..ఈటల అనుచరులు ఒత్తిడి తెస్తున్నారంటూ..సమాచారం. ఈటల, ఆయన అనుచరులు ఆక్రమించిన భూమిని తిరిగి ఇప్పించాలంటూ..రైతులు మొరపెట్టుకుంటున్నారు. మంత్రి ఈటల భూకబ్జాలకు పాల్పడినట్లు సంచలన ఆరోపణలు వెలుగు చూసిన సంగతి తెలిసిందే. సుమారు 100 ఎకరాల భూమిని ఈటల జమునా హ్యచరీస్‌ కోసం కబ్జా చేశారని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ దీనిపై స్పందించారు. ఈటల భూకబ్జా ఆరోపణలపై విచారణకు ఆదేశించారు. దర్యాప్తు జరిపి నివేదిక ఇవ్వాలని సీఎస్‌ను ఆదేశించారు. కలెక్టర్‌ ద్వారా సమగ్ర రిపోర్ట్‌ తెప్పించి ఇవ్వాలన్న సీఎం కేసీఆర్‌.. నిజనిజాలను నిగ్గు తేల్చాలని డీజీ పూర్ణచంద్రరావుకు ఆదేశాలు ఇచ్చారు. వెంటనే ప్రాథమిక నివేదిక అందజేయాలని కేసీఆర్‌ డీజీని ఆదేశించారు.

Related Posts